ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
తిరుమలగిరి 03 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి బీసీ కాలనీ అంగన్వాడి సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి కౌన్సిలర్ గిలకత్తుల ప్రియలత మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు త్రాగించాలి. ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. రెండు సంవత్సరాల వరకు అనుబంధ పోషక ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలి అని అన్నారు. అనంతరం వైద్యాధికారి వందన గారు మాట్లాడుతూ తల్లిపాలను మించిన దివ్య ఔషధం మరొకటి లేదని ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలను త్రాగించాలి అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఐ సి డి ఎస్ సూపర్వైజర్ కైరున్నిసా మాట్లాడుతూ ముర్రుపాలు అమృతంతో సమానం తల్లిపాలు పిల్లలకు టీకా మాదిరిగా పనిచేస్తుంది .పిల్లలు వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి పోషణ లోపం లేకుండా ఉండాలంటే తల్లిపాలు త్రాగించాలి. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఐసిడిఎస్ సూపర్వైజర్ మంగమ్మ మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యానికి పునాది తల్లిపాలు తొలి పోషణ రక్షణ ఇచ్చేది తల్లిపాలు మాత్రమే మరియు శిశు ఎదిగేందుకు అన్ని పోషకాలను సమకూర్చేవి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడేవి తల్లిపాలు మాత్రమే అని అన్నారు. అనంతరం ర్యాలీ తీయడం జరిగింది.బాలింత ఇంటికి గృహ సందర్శనకు వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్ ఎల్ హెచ్ పి శిరీష ,హెల్త్ సూపర్వైజర్ స్వరూప రాణి, ఏఎన్ఎం శ్రీలత ధనమ్మ ,అంగన్వాడీ టీచర్స్ శోభారాణి, అండాలు, ప్రైమరీ స్కూల్ టీచర్స్ గంగా, వెంకటేష్ ,ఆశ వర్కర్లు, గర్భవతులు ,బాలింతలు తల్లులు ,కిశోర బాలికలు పాల్గొన్నారు