ఏదైనా వికలాంగులను అంటే ఊరుకునేది లేదు
భువనగిరి 23 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రకటించే హక్కు ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ కు ఎక్కడిదని వికలాంగులను కించపరిచే విధంగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన స్మిత సబర్వాల్ పై చర్య తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షుడు స్వరూపంగా ప్రకాష్ డిమాండ్ చేశారు మంగళవారం భువనగిరి పట్టణంలో సంఘం సమావేశం మాట్లాడుతూ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా చలామణి అవుతూ వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం సర్వీస్ లో రిజర్వేషన్లు అవసరం లేదని ప్రకటించడం ఆమె అహంకార ధోరణికి నిదర్శనం అని అన్నారు
కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగ నియామకాలలో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఉందని కోర్టు తీర్పులు ఉన్నాయని విషయం మరియు 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టం సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో వికలాంగుల కొరకు ప్రత్యేకంగా వైకల్యాన్ని బట్టి రిజర్వ్ పోస్టులు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగాలలో అమలు చేయాలని8 స్పష్టంగా ఉంది విషయం777 తెలియకుండా ఐఏఎస్ ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు ప్రతిభ ఎవరి సొత్తు కాదని అంగవైకల్యం కనే కలిగిన అనేకమంది సమాజంలో అద్భుతాలు సృష్టిస్తున్న విషయము గుర్తించుకోవాలన్నారు అనంతరం భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో స్మిత సబర్వాల్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్ ఇవ్వడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత జిల్లా నాయకులు పాక వెంకటేష్ యాదవ్ పల్లెపాటి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.