బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా.
కార్యకర్తలను కాపాడుకోవడమే నా లక్ష్యం.
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
తిరుమలగిరి 03 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని పలు గ్రామాలలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.కార్యకర్తలను ఆదుకోవడం నా బాధ్యత అని ఎల్లవేళలా వారికి అండగా ఉంటానని చెప్పారు.మామిడాల గ్రామంలో మాజీ మార్కెట్ డైరెక్టర్ బానోతు యాకూబ్ నాయక్ తండ్రి బానోతు లచ్య నాయక్ మరణించగా అదేవిధంగా గుండెపురి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గుండెబోయిన యాదయ్య యాదవ్ ఇటీవల మరణించడంతో వాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాదరి కిషోర్ కుమార్ ఆయనతోపాటు తిరుమలగిరి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, నాగారం మండల అధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, టిఆర్ఎస్వి సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబు తో పాటు పలువురు పాల్గొన్నారు.అనంతరం బండ్లపల్లి బిఆర్ఎస్ మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగాం శేఖర్ కుమారుడు సాయి కిరణ్ ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి,10/వేల రూ ఆర్థిక సాయం మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మృతుని కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ డైరెక్టర్ మంచినీళ్ల మహేందర్,భాస్కర్,బింగి వెంకన్న,చిల్లర చంద్రమౌళి,దయా యాదవ్,ఈదుల కిరణ్, ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.