ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం - ఐజలో ముమ్మరంగా సాగుతున్న వార్డు సభలు
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా *మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్ మరియు మున్సిపల్ కమిషనర్ సైదులు *. పట్టణంలోని 13వ వార్డులో *"వార్డు సభను"* ప్రారంభించి, ప్రజలతో ముఖాముఖి చర్చించారు..
వార్డు సభలో భాగంగా *మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్.* మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధిలో వార్డు సభల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి ఆస్కారం ఉందని. ముఖ్యంగా వార్డుల్లో నెలకొన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందేలా చూడటం. వీధి దీపాల నిర్వహణ మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చర్యలు. డ్రైనేజీ, తాగునీరు మరియు ఇతర పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి. ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు..
మున్సిపల్ కమిషనర్ సైదులు మాట్లాడుతూ, వార్డు సభల ద్వారా సేకరించిన వినతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, గడువులోగా పరిష్కరించేలా యంత్రాంగం పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. పారదర్శకతతో కూడిన పాలనను ప్రజలకు అందించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
- వార్డు ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చైర్మన్ మరియు కమిషనర్ గారు అధికారులను కోరారు. ఐజ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్‌తో పాటు
ఎం. కృష్ణ (14వ వార్డు కౌన్సిలర్)
మున్సిపల్ ఏఈ (AE) , అగ్రికల్చర్ ఆఫీసర్ యువరాజ్ ,
వార్డు స్పెషల్ ఆఫీసర్లు,
మున్సిపల్ సిబ్బంది, గాండ్ల విజయ్ , చరణ్ , వార్డు పెద్దలు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు....