విద్యావంతుల తరఫున ప్రశ్నించే తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కే అన్ని పార్టీల మద్దతు
సూర్యాపేటలో వాకర్స్ ను పట్టబద్రుల ఓటు అభ్యర్థించిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించే తీన్మార్ మల్లన్నను ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టబద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యావంతులు, నిరుద్యోగులు, మేధావులు మెదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కోరారు.* ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వేకువ జామున సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్, ఎస్వి డిగ్రీ కళాశాల మైదానం, పబ్లిక్ క్లబ్ లో వాకర్స్ ను, క్రీడాకారులను ఓటు అభ్యర్థించి మాట్లాడారు. తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు.
ప్రభుత్వంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాడన్నారు. గతంలో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసే లక్ష ఇరవై వేల ఓట్లకు పైగా గెలుచుకొని కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్నకు అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు.
నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన పోరాడి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న అవుతాడని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.* టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల క్యాలెండర్ను సమర్ధవంతంగా అమలు చేయగల తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, ఊర రామ్మూర్తి యాదవ్, నాయకులు నేరెళ్ల మధు, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న, గాయం కరుణాకర్ రెడ్డి,తండు శ్రీనువాసు, స్వామి నాయుడు, ఈర్ల వాసు, యాట వెంకన్న, పోల గాని కృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.