పాటశాలలలో ప్రవేశానికి బ్యాటరీ టెస్ట్ ద్వారా భద్రాచలం ఐటీడీఏపీవో బి.రాహుల్.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పాటశాలలలో 5 వ తరగతి లో ప్రవేశానికి బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది భద్రాచలం ఐటీడీఏపీవో బి.రాహుల్.
తెలంగాణ వార్త ఏప్రిల్ 1జిల్లాస్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న క్రీడా పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశానికి బాల బాలికలకు బ్యాటరీ టెస్టు నిర్వహించి ఎంపిక చేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
కిన్నెరసాని, కచేనపల్లి క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన బాలబాలికలకు తొమ్మిది రకాల బ్యాటరీ టెస్ట్ నిర్వహించి కచేనపల్లి క్రీడా పాఠశాల బాలికలు 40 మంది, కిన్నెరసాని క్రీడా పాఠశాల బాలురు 40 మందిని ఎంపిక చేసి ఐదవ తరగతిలో ప్రవేశం కల్పించడం జరిగిందని అన్నారు.
ఈ ఎంపికలు దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్, క్రీడల అధికారి గోపాలరావు, ఏ సీఎంఓ రాములు, ఏ ఎస్ ఓ వెంకటనారాయణ, రాంబాబు మరియు 9 మంది పిడి, పి ఈ టి ల సారధ్యంలో ఈ ఎంపిక పోటీలు నిర్వహించి నిష్ణాతులైన బాలబాలికలను తీసుకోవడం జరిగిందని అన్నారు.
కిన్నెరసాని క్రీడా పాఠశాల బాలురు 105 మంది, కచేనపల్లి క్రీడా పాఠశాల బాలికలు 72 మంది ఎంపికలలో పాల్గొనగా అన్ని రకాల టెస్టులు నిర్వహించి 40 మంది చొప్పున రెండు పాఠశాలల్లో కలిపి 80 మందిని ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.