ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి:జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

Sep 5, 2024 - 19:32
 0  5
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి:జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి:జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్

జోగులాంబ గద్వాల5 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్.ఎ.ఎల్.డి కళాశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ సందర్బంగా యు.పి.ఎస్.సి సివిల్ సర్వీసెస్ పరిక్షల  ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు జిల్లా ఎస్పి టి.శ్రీనివాస రావు తో కలిసి జిల్లా కలెక్టర్ బి.యం సంతోస్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్‌ పై ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులకు పరీక్షల యొక్క  సిలబస్, ప్రిపరేషన్ పై అవగాహన కల్పించడం అన్నారు. జిల్లా కలెక్టర్ తమ వ్యక్తిగత మరియు వృత్తిగత రంగాలలో సొంత అనుభవాలను వివరించారు. ఐఏఎస్ స్థాయికి చేరుకోవాలంటే, ప్రతి ఒక్కరిలోనూ నిరంతరం శ్రమ, పట్టుదల మరియు ప్రేరణా ఎంతో కీలకమని అన్నారు. పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించాలంటే కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ క్రమంగా చదువుకోవడం అవసరమని అన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించి, ఒక ఉద్దేశంతో చదవాలని అన్నారు. సిలబస్, మోడల్ పేపర్లు, బేసిక్స్ , న్యూస్ పేపర్  వీటి దృష్ట్యా పరిక్షలకు సిద్దం అవ్వాలని అన్నారు. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా ప్రాధాన్యం కలిగి ఉండలాని, ఆన్లైన్ క్లాసులు, గ్రూప్ స్టడీ ద్వారా నాలెడ్జ్ పెంపొందించుకోవడం  అవసరమని అన్నారు. గ్రూప్‌ వారిగా సబ్జెక్టులను చదవడం, డిస్కస్ చేయడం వల్ల టైమ్ సేవ్ చేయడమే కాకుండా,  మెరుగైన ఫలితాలు సాధించడానికి దోహదపడుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు మాట్లాడుతూ తమ వృత్తి అనుభవాలను పంచుకుంటూ,యువతకు స్ఫూర్తి కల్పిస్తూ,కఠిన శ్రమతో కూడిన ప్రణాళికను పాటిస్తే తప్పకుండా విజయాలు సాధించగలమని అన్నారు. హైదరాబాద్‌లో మాత్రమే కాదు, గద్వాలలో కూడా సివిల్స్‌ కు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి కోచింగ్ క్లాసులు అందిస్తామని తెలిపారు. ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండాలని, నీలో ఉన్న బద్దకాన్ని,అపనమ్మకాన్ని నా వల్ల కాదు అనే ఆలోచనలను తీసి వేసి చక్కటి ప్రణాళిక చేసుకొని చదివితే ఇతరులకు ఆదర్శంగా నిలవగలమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉన్నత లక్ష్యాల వైపు వెళ్లాలని కోరారు.మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా, యువతులకు గొప్ప అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం డ్రగ్స్ వల్ల జరిగే దుష్ఫలితాల, షీ టీం పోస్టర్స్, ట్రాఫిక్ నియమాల పోస్టర్స్ జిల్లా కలెక్టర్ తో కలసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  డా.ఆర్.కాలందర్ భాష, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ప్రియాంక,ఈ.డి ఎస్.సి రమేష్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ చంద్ర మోహన్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333