షాట్ సర్క్యూట్ వస్త్ర దుకాణం దగ్దం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత
జోగులాంబ గద్వాల 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పట్టణ పరిధిలోని చిన్న అగ్రహారం దగ్గర ఓ ఇంటిలో గల బట్టల షాప్ షాట్ సర్క్యూట్ తో దగ్దమైంది. రూ. 30 లక్షల వరకు వస్త్రాలు కాలి బూడిదైనాయి. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ ప్రమాదానికి గురైన షాపును పరిశీలించడం జరిగింది. బట్టల షాప్ యజమాని చంద్రబాబు ని పరామర్శించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తానని బరోసా ఇచ్చారు.