పోలీసులకు ఇసుక ట్రాక్టర్ లను పట్టిచారంటూ దాడి చేశారు

Feb 27, 2024 - 21:17
 0  19
పోలీసులకు ఇసుక ట్రాక్టర్ లను పట్టిచారంటూ దాడి చేశారు

తెలంగాణ వార్త ఆత్మకుర్ యస్   పోలీసులకు ఇసుక ట్రాక్టర్లు పట్టించారంటే దాడి రెండు ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు... ఆత్మకూర్ ఎస్.... తమ ఇసుక ట్రాక్టర్లను పోలీసులకు పట్టించారంటూ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులు పోలీసులు గ్రామం లో ఉండగానే రైతుపై దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని ఏపూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే ఏపూరి వీటిలో పెద్ద కొంతకాలంగా ఇసుక దందా జోరుగా సాగుతుంది. టిఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ సానుభూతిపరులు కొందరు దందాను కొనసాగించారు. ఇటీవల ప్రభుత్వ మారడం తో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు మరికొందరు ఇసుక దందాకు సిద్ధమయ్యారు. ఇటీవల కొత్తగా వచ్చిన ఎస్ఐ ఇసుక తరపున రికార్డ్ అయిన భాగంగా ఎప్పుడు చంద్ర ఇసుక ట్రాక్టర్ల యజమానులను పోలీస్ స్టేషన్లో ఇసుక తరలించకుండా మైండ్ ఓవర్ కావాలని తెలిసింది. ఎస్సై చెప్పినప్పటికీ యజమానులు ట్రాక్టర్ ద్వారా ఇసుకను కొనసాగిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై తమ సిబ్బందితో మంగళవారం సాయంత్రం వీటిలో ఇసుక నింపుతున్న రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రాక్టర్లకు చెందిన అభిమానులు అదే గ్రామానికి చెందిన గొట్టముక్కల మల్లారెడ్డి రైతుపై దాడి చేశారు . ట్రాక్టర్లు స్వాధీనపరచుకున్న పోలీసులు ఇసుక తరలింపు కారకులైన వారిని తరలించేందుకు ఎదురుచూస్తుండగా సమీపంలోని ఇసుక దందా యజమానులు పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న రైతు గొట్టిముక్కల మల్లారెడ్డి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాలైన మల్లారెడ్డి సూర్యపేట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో తరలించారు. దాడికి పాల్పడిన ఇసుక ట్రాక్టర్ యజమాని సుదగాని ఉపేందర్ ను పోలీసులు అదుపులో తీసుకొన్నట్లు దాడిలో గాయపడిన మల్లారెడ్డి భార్య గొట్టిముక్కల నాగమణి పిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సానబోయిన ఉపేందర్, సతీష్, శ్రీకాంత్ ల పై కేసు నమోదు చేసినట్లు ఎటిలో ఉన్న సానబోయిన వెంకటేష్, ఉపేందర్ ల ట్రాక్టర్ లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ ఐ సైదులు తెలిపారు. *10ఏళ్లు బీ అర్ ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ఇసుక తరలింపు కు రంగం సిద్దం* ఏపూరి గ్రామంలో ఇసుక తరలింపుకు మళ్లీ రంగా సిద్ధమైంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న విఆర్ఎస్ పార్టీ సానుభూతిపరులు ప్రత్యేకంగా ఇసుక తరలింపు కోసమే ట్రాక్టర్లు కొని దందా కొనసాగించారు. ఇకనుండి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఇసుక దందాకు సిద్ధమయ్యారు. గత వారం రోజులు నీటిలో విచ్చలవిడిగా ట్రాక్టర్లతో ఇసుక దందా కొనసాగుతుండగా ఇరు పార్టీలకు చెందిన ట్రాక్టర్లు వివాదాలకు దారి తీశాయి. పోలీసులు కలగజేసుకొని ఇసుక దందా కొనసాగించకుండా బైండోవర్ కావాలని ఎస్ఐ ఆదేశాలు ఇచ్చినప్పటికీ వారి వారి పార్టీల నాయకులతో చెప్పుకొని బైండోవర్ కాకుండా ఇష్టానుసారంగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఏట్లో ఇసుక నింపుతున్న బీ అర్ ఎస్ కు చెందిన రెండు ట్రాక్టర్లను తీసుకోగా కాంగ్రెస్కు చెందిన మల్లారెడ్డి పోలీసుల సమాచారం ఇచ్చారని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ట్రాక్టర్ యజమానులు మల్లారెడ్డి పై దాడి చేశారు. మండలంలో మాక్త కొత్తగూడెం ఏపూరు ముక్కుడుదేవులపల్లి రామన్నగూడెం, నూతనకల్, పాతర్ల పాడ్ గ్రామాలలో ఇసుక దందా జోరుగా కొనసాగుతుంది. పోలీసులు చేసుకోగానే నాయకులతో ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలనే నీటి నిలువల కోసం ఏటిపై మండల పరిధిలో సుమారు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెక్ డ్యాం లు నిర్మించారు.. మళ్లీ ఇసుక దందా కొనసాగడంతో నీటి నిలువలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది.