పోలీసు కుటుంభం మంచి సోదరున్ని కోల్పోయింది, చాలా బాధాకరం, దురదృష్టకరం
... కె.నరసింహ, జిల్లా ఎస్పీ సూర్యాపేట
రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతి దేహానికి ప్రభుత్వ ఆస్పటల్ నందు పూలమాల వేసి నివాళి ఘటించారు జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందడం చాలా బాధాకరం, ఈ సంఘటన చాలా దురదృష్టకరం, కమలాకర్ మంచి సర్వీస్ రికార్డు కలిగిన వ్యక్తి, ఒక మంచి పోలీస్ కోల్పోయాం అని ఎస్పీ నరసింహ ఆవేద వ్యక్తం చేశారు, కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం అని, కమలాకర్ ఆశయాలు, ఆలోచనలు ముందుకు తీసుకెళతాము అన్నారు, పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజల రక్షణలో, సమాజ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టీ నిరంతరం పని చేస్తున్నారు. విధుల నిర్వహణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఎస్పి గారి వెంట DSP ప్రసన్న కుమార్, CI నాగేశ్వరరావు, CI వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ ఉన్నారు