బతుకుదెరువు కోసం వెళ్లి హైదరాబాదులో రైలు కిందపడి ఆత్మహత్య.

Mar 25, 2025 - 21:14
 0  13
బతుకుదెరువు కోసం వెళ్లి హైదరాబాదులో రైలు కిందపడి ఆత్మహత్య.

తెలంగాణ ఆత్మకూరు ఎస్ రాంప్రసాద్ మృతితో గట్టికల్లులో విషాదం. బతుకుదెరువు కోసం వెళ్లి హైదరాబాదులో రైలు కిందపడి ఆత్మహత్య. ఆర్థిక సమస్యలే కారణం కుటుంబ సభ్యులు.. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని గట్టికల్లు గ్రామానికి చెందిన బెజ్జంకి రాంప్రసాద్ 35. హైదరాబాద్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గట్టికల్లులో మంగళవారం విషాదం అలుముకొన్నది. బ్రతుకుతెరువు కోసం గత ఏడాది హైదరాబాద్ కు వెళ్ళిన రాంప్రసాద్ తన కులవృత్తి అయిన కార్పెంటర్గా చేస్తూ చాలిచాలనీ వేతనంతో కుటుంబం పోషించడం కష్టంగా మారింది.గత కొద్దిరోజులు గా ఆర్థిక సమస్యలతో కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయని దాంట్లో భాగంగానే సోమవారం రాత్రి ఇంట్లో చికాకుతోవెళ్లిన రాంప్రసాద్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాదు నుండి మౌలాలిలో మన భార్య పిల్లలతో నివాసముంటున్న మృతుడు రాంప్రసాద్ ఘట్కేసర్ సమీపంలో రైల్వే ట్రాక్ పై సోమవారం రాత్రి మృతి చెందాడని తెలిపారు. రామ్ ప్రసాద్ మృతి తో గ్రామం లో విషాదం నెలకొంది. మంగళవారం సాయంత్రం రాంప్రసాద్ మృతదేహం స్వగ్రామమైన గట్టికల్లుకు తీసుకొచ్చారు. రాంప్రసాద్ మృతదేహానికి స్థానికులు పూల మాల వేసి నివాళులర్పించారు. మృతుడు రాంప్రసాద్ కు భార్య కూతురు కుమారుడు ఉన్నారు../