కామ్రేడ్ బొమ్మ గాని వెంకటయ్య గారి ఆశయాలను సాధిద్దాం

Apr 11, 2024 - 20:05
 0  2
కామ్రేడ్ బొమ్మ గాని వెంకటయ్య గారి ఆశయాలను సాధిద్దాం

 భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, కే వీ యల్( KVL)

 భారత కమ్యూనిస్టు పార్టీ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధులు గీత పని వరల రాష్ట్ర నాయకులు కీర్తిశేషులు కామ్రేడ్ బొమ్మగాని వెంకటయ్య గారి ఆశయాలను సాధించాలని సిపిఐ రాష్ట్ర నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, కెవియల్  పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గురువారం   ప్రధమ వర్ధంతి సందర్భంగా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మగాని వెంకటయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమికి గీసే వారికి  చెట్టు అని నినాదంతో భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన పోరాటంలో ముందుండి పోరాడిన మహా నాయకుడు అని కొనియాడారు. సూర్యాపేట పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేక ఉద్యమాలలో పాల్గొని పేద ప్రజలకు ఇంటి స్థలాల కోసం ముందుండి పోరాడి వాటిని పంపిణీ చేసిన నాయకుడని వారన్నారు.  హరాజ్ విధానానికి వ్యతిరేకంగా పోరాడి గీత కార్మికులను చైతన్య పరిచి  సొసైటీలను ఏర్పరచడంలో   ఆయన పాత్ర కీలకమైనదని వారు తెలిపారు. సిపిఐ పట్టణ కార్యదర్శి  బూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అనంతుల మల్లేశ్వరి, ఏఐటియుసి ప్రాంతయ అధ్యక్షులు దంతల రాంబాబు, సిపిఐ మాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మ గాని శ్రీనివాస్, దొరిపెల్లి శంకర్, సీనియర్ నాయకులు ఖమ్మం పాటి అంతయ్య, చివేముల మండల కార్యదర్శి ఖమ్మం పాటి రాము, గీత పనివారల  జిల్లా అధ్యక్షులు రేగటి లింగయ్య, ఏఐటీయూసీ  ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్,  AIYF పట్టణ కార్యదర్శి ఎడెల్లి  శ్రీకాంత్ మైనార్టీ నాయకులు ఎండి పాషా, యువజన నాయకులు తాళ్ల సైదులు, బుబ్బ హరి, నిమ్మల శేఖర్, దంతాల పద్మ రేఖ, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333