ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
తిరుపతి మోడల్ లో యాదాద్రిని తీర్చిదిద్దాలి .
సామాన్యులకు బస చేసేందుకు సౌకర్యాలు కల్పించాలి.
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్.
(యాదగిరి గుట్ట, టౌన్ మే 19) : సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని శాంతిని నెలకొల్పాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట లోని లక్ష్మీ నరసింహ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి మాదిరిగా యాదాద్రిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్య కోసం అన్ని హంగులతో నిర్మాణాలు చేపట్టేందుకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం దేవాలయానికి వచ్చేటువంటి భక్తులలో విఐపి లకు మాత్రమే బస చేసేందుకు రూముల సౌకర్యం ఉందని, సామాన్యులకు కూడా రూ. 500 కే రూమ్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి దేవాలయ నిర్మాణంతో పాటు వీలైనన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. యాదాద్రి దేవాలయం సమీపంలో భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని దీనివల్ల ప్రభుత్వం కి ఆదాయం సమకూరుతుందని పంతంగి వీర స్వామి గౌడ్ సూచించారు.