పేటలో ఘనంగా శ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ బోనాలు..
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
సూర్యాపేట, 30 ఆగష్టు 2026 తెలంగాణవార్త విలేఖరి :- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ లో గల శ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లికి వైభవోపేతంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ బోనాల పండుగ వేడుకను పురస్కరించుకొని ముందస్తుగా మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవాలయాల నిర్వాహకులు, గౌడ పెద్దలు, పూజారులు ఘనస్వాగతం పలికి సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించి శాలువాతో సత్కరించారు..