శిరీష మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలి

Aug 30, 2026 - 15:30
Aug 30, 2026 - 15:33
 0  7
శిరీష మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలి

ఆదివాసి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

అనుమానాస్పద మృతిపై లోతైన దర్యాప్తు అవసరం: మాజీ ఎమ్మెల్యే తాటి

ములకలపల్లి, 30 ఆగష్టు 2026 తెలంగాణవార్త విలేఖరి:- ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి యువతి శిరీష హైదరాబాద్‌ తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేకుండా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఆమె మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తాటి వెంకటేశ్వర్లు కోరారు. ఘటనకు ముందు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలించి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అన్నారు. మృతికి అసలు కారణం ఏంటన్నది స్పష్టంగా తేల్చి, దర్యాప్తులో ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం కోసం స్వగ్రామానికి దూరంగా వెళ్లిన ఆదివాసి యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం ఆందోళన కలిగించే విషయమన్నారు. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో వారి భద్రతకు అవసరమైన రక్షణ చర్యలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. శిరీష కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉందని, వారికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ సభ్యులకు తగిన న్యాయం, సహాయం అందేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తాటి వెంకటేశ్వర్లు కోరారు. శిరీష మృతికి సంబంధించిన ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి, కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333