పార్లమెంటు ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తాం

Feb 21, 2024 - 21:32
Feb 22, 2024 - 19:49
 0  25
పార్లమెంటు ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తాం

బిజెపి నల్లగొండ పార్లమెంట్ కోకన్వీనర్ తుక్కాని మన్మధ రెడ్డి

 సూర్యాపేట: రాబోయే  ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బిజెపి నల్లగొండ పార్లమెంట్ కో కన్వీనర్ తుక్కాని మన్మధరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ   లోక్ సభ స్థానం  నుంచి బిజెపి  అభ్యర్థిగా టికెట్ ను ఆశిస్తున్నానని గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ  జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. సూర్యాపేట పట్టణంలో పాఠశాల, కళాశాలను నడిపానని  విద్యావేత్తగా విద్యా సంస్థలు  నెలకొల్పి వేలాదిమందికి విద్యను అందించిన చరిత్ర  తనకు ఉందని చెప్పారు. సూర్యాపేట, నలగొండ జిల్లాలలో అందరికీ సుపరిచితునని పార్టీ అధిష్టానం ఆలోచించి తనకు ఎంపీ టికెట్ గా ప్రకటిస్తే అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేశానని, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో  కేంద్రంలో  భారతీయ జనతా పార్టీ మూడో పర్యాయం అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత మోడీకే దక్కిందని భారతదేశాన్ని అభివృద్ధి పరంగా అగ్రగామిగా తీసుకొచ్చేందుకు కృషి చేయడం గర్వకారణం అని పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు ఆశీస్సులతో తనకు టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అవకాశం కల్పిస్తే వేలాది సహకరిస్తారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో   బిజెపి రాష్ట్ర నాయకులు బూర మల్సూర్ గౌడ్, దోసకాయల ఫణి నాయుడు, గద్దల గణేష్, జటంగి ఉపేందర్, గుణగంటి శ్రీనివాస్ గౌడ్, తదితరులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333