హ్యాట్రిక్ దిశగా ఎంపీ బీ.బీ పాటిల్..!

Mar 17, 2024 - 11:29
Mar 21, 2024 - 23:28
 0  7
హ్యాట్రిక్ దిశగా ఎంపీ బీ.బీ పాటిల్..!
హ్యాట్రిక్ దిశగా ఎంపీ బీ.బీ పాటిల్..!

బీబీ పాటిల్ ....తెలంగాణ సమాజానికి పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణలోని జహీరాబాద్ నుంచి ప్రస్తుతం బీబీ పాటిల్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజకీయవేత్తగా ఎంత పేరుందో అంతకుమించిన పేరు ఒక సమాజ సేవకుడిగా బీబీ పాటిల్‌కు ఉంది. 

బీబీ పాటిల్‌ పూర్తి పేరు భీమ్‌రావు బస్వంత్ రావు పాటిల్. అభిమానులు ఆయనను ఆత్మీయంగా బీబీ పాటిల్ అని పిలుచుకుంటారు. చివరకు బీబీ పాటిల్‌గానే ఆయన తెలంగాణ అంతటా పాపులర్ అయ్యారు. భీమ్‌రావు బస్వంత్ రావు పాటిల్ స్వగ్రామం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మద్నూరు మండలం సిర్పూర్. బీబీ పాటిల్ 1955 నవంబరు ఒకటో తేదీన జన్మించారు. పాటిల్ మొదటినుంచి చదువులో చురుకుగా ఉండేవారు. అగ్రికల్చర్ బీఎస్సీ చదివారు. చదువు పూర్తయిన తరువాత వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. పాటిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో అప్పట్లో ఆయన ఒక వెంచర్ ప్రారంభించారు. ఈ వెంచర్ ప్రారంభమైన కొన్ని సంవత్సరాలకే మంచి ఫలితాలు సాధించింది. వ్యాపార రంగంలో పాటిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సూపర్ డూపర్‌గా హిట్టయింది. పాటిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థ, కన్‌స్ట్రక్షన్ రంగంలో అనేక విజయాలు నమోదు చేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో బీబీ పాటిల్ కంపెనీస్ గ్రూప్ అనేక కీలక నిర్మాణాలు చేపట్టింది. 2014లో ఎంపీగా ఎన్నిక విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందిన బీబీ పాటిల్‌పై రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో బీ బీ పాటిల్ చేరారు. బీబీ పాటిల్‌కు సామాన్య ప్రజల్లో ఉన్న పేరు కేసీఆర్ దృష్టికి వెళ్లింది. పాటిల్‌కు 2014 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీబీ పాటిల్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అందరి దృష్టి ఆకర్షించారు. అప్పటివరకు జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ అంటే కేవలం నాయకులకే తెలుసు. సామాన్య ప్రజలెవరూ ఎంపీని చూసి ఉండలేదు. అలాంటి పరిస్థితుల్లో జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రతి సమస్య పరిష్కారానికి బీబీ పాటిల్ తీవ్ర కృషి చేశారు. ఎంపీ అంటే పాటిల్ లా ఉండాలి అని ప్రజలు అనుకునేలా ఆయన పనిచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే జనం మెచ్చిన, జనానికి నచ్చిన ఎంపీ అయ్యారు. బీబీ పాటిల్ రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 

జనం సమస్యలపై గళమెత్తిన బీబీ పాటిల్ ప్రస్తుత లోక్‌సభలో బీబీ పాటిల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. నియోజకవర్గ సమస్యలపై తనదైన శైలిలో బీబీ పాటిల్ అనేకసార్లు గళమెత్తారు. ఇప్పటికీ లోక్‌సభలో జనం సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటారు. సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తునే ఉంటారు.2018లో కూడా ఎంపీ గా బీబీ పాటిల్ నే అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించారు.2018లోను భారీ మెజారిటీ తో బీబీ పాటిల్ గెలుపొందారు.జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి సమస్యపైనా బీబీ పాటిల్ అలుపెరుగని పోరాటం చేశారు...చేస్తూనే ఉన్నారు.

కోవిడ్ సమయంలో నిరుపమాన సేవలు కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు బీబీ పాటిల్, సామాన్య ప్రజలకు నిరుపమాన సేవలు అందించారు. సర్కార్ సాయం కోసం ఎదురు చూడలేదు. జేబులో డబ్బులు పెట్టి కోవిడ్ సోకిన వారికి వైద్య చికిత్సలు చేయించారు. స్వంత సొమ్ములతో కొన్ని వేల మందికి ఖరీదైన మాస్క్‌లు, శానిటైజర్లు పంచి పెట్టారు. కోవిడ్ సమయంలో అనేక మంది ఉపాథి కోల్పోయి రోడ్డున పడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి వారందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేశారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు భారీ ఎత్తున సేఫ్టీ కిడ్స్ పంచి పెట్టారు. వికలాంగుల కోసం వేలాది మందికి వీల్ చెయిర్‌లు పంపిణీ చేశారు. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో బీబీ పాటిల్ ఫౌండేషన్ పేరుతో అనేక చోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఎంపీ నిధులను పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు కొనుగోలు చేయడానికి అందచేశారు. కోవిడ్ వైరస్‌కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించారు. బీబీ పాటిల్ తన దగ్గరకు వచ్చిన ఎవరినీ ఖాళీ కడుపుతో పంపారు. భోజనం పెట్టే పంపిస్తారు. ఎవరు కలిసినా...బావున్నావా ? భోజనం అయిందా ? అంటూ ఆత్మీయంగా పలకరించడం బీబీ పాటిల్ అలవాటు.బీ బీ పాటిల్ పెద్ద మనస్సుకు ఇదే నిదర్శనం అంటారు జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో లింగాయత్ సామాజికవర్గ ఓట్ల శాతం ఎక్కువగా ఉండటం ఎంపీ బీ బీ పాటిల్ కూడా అదే సామాజిక వర్గం కావడంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా బీబీ పాటిల్ కే ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇటీవలే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ పార్టీ లో చేరిన బీబీ పాటిల్ ప్రస్తుతం ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలతో బీ బీ పాటిల్ ప్రచారం జోరందుకుంది. ప్రత్యర్థులు సైతం కనుమరుగయ్యే విధంగా బీబీ పాటిల్ ప్రచారం సాగుతుంది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే బీబీ పాటిల్ హ్యాట్రిక్ ఎంపీగా గెలవడం ఖాయం అంటున్నారు జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333