సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని కలిసిన
అడ్డగుడూరు సీపీఎం మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్
అడ్డగూడూరు 23 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సోమవారం రోజు హైదరాబాద్ లోని సీపీఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నూతన రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ని మర్యాద పూర్వకంగా కలసి పూలేబొక్కే,శాలువత సన్మానించడం జరిగింది.
అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ..తెలంగాణలో రానున్న రోజుల్లో ఉద్యమాలు ఉదృతం చేయడం కోసం సంసిద్ధం కావాలని తెలిపారు.అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యల గురించి ఖాళీగా రాకేష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శికి అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కూడా రాష్ట్ర కార్యదర్శి దృష్టికి తీసుకుపోవడం జరిగింది.అదేవిధంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని కోరడం జరిగిందని అన్నారు.