వడ్లకు గిట్టుబాటు ధర లభిస్తుంది ఎమ్మెల్యే మందుల సామేలు

అడ్డగూడూరు 07 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం,చిర్రగూడూర్ గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు. దళారులకు వరి ధాన్యాన్ని విక్రయించకుండా ప్రభుత్వ నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించుకుని మద్దతు ధర పొందాలన్నారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం లబ్ధిదారుడు జానకిపురం గ్రామానికి చెందిన అంబటి రామచంద్రు కుటుంబాన్ని సందర్శించి,వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, తహసిల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య,ఏవో పాండురంగాచారి,పిఎసిఎస్ సీఈవో వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,మోత్కూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి,ఇటికాల చిరంజీవి,బాలెంల విద్యాసాగర్,పాశం సత్యనారాయణ,కోట విద్య సాగర్ రెడ్డి, కేసరపు శ్రీనివాసరెడ్డి,బాలెంల సైదులు, మందుల సోమన్న,సమ్మయ్య,శ్రీను, నాగరాజు,శ్రీనివాస్ గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.