పరిసరాల పరిశుభ్రత పై మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు అవగాహన

Jul 29, 2026 - 22:13
 0  1
పరిసరాల పరిశుభ్రత పై మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు అవగాహన

నర్సాపూర్ 29 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని మూసాపేట్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కు చెందిన బి.ఎస్సి అగ్రికల్చరల్ విద్యార్థులు రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా సర్పంచ్ మమత,ఉప సర్పంచ్ కిస్టగౌడ్ మరియు వార్డు మెంబర్ల,ఆధ్వర్యంలో గ్రామస్థులకు,విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ తమ ఇళ్ళు,పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రంగా ఉంటే జనాలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.దీంతో గ్రామం కూడా పరిశుభ్రంగా తయారవుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని బి.ఎస్సి అగ్రికల్చరల్ విద్యార్థినులు హారిక,కౌలిక, పూజిత,స్పందన,సాక్షి, శ్రీవాణి,తేజశ్రీ కలిసి నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333