ఆగస్టు10న కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు యాదగిరి
అడ్డగూడూరు 29 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,కర్షక,కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆగస్టు 10న నిర్వహించనున్న జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రోజు అడ్డగూడూరు మండల కేంద్రంలోని స్థానిక యం. ఆర్ ఫంక్షన్ హాల్లో సీఐటీయూ,రైతు సంఘం,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు యాదగిరి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ,నాలుగు లేబర్ కోడ్‌ల ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తోందన్నారు.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో,వ్యవసాయానికి అవసరమైన మద్దతు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.నిత్యావసర వస్తువుల ధరలు,గ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించడం లేదని వీబీజీరామ్ గా పేరు మార్చి నిర్వీర్యం చేస్తుందని,కూలి రేట్లు పెంచడం వంటి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం,నిరుద్యోగాన్ని పెంచే విధానాలు అమలు చేయడం, కార్మికులు,రైతులు,వ్యవసాయ కూలీల సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని విమర్శించారు.ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 10న జరిగే జైలు భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు,వ్యవసాయ కూలీలు, యువజనులు,మహిళలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు పోట్ల యాదమ్మ,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బుర్రు అనిల్ కుమార్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ వర్కర్స్ మండల అధ్యక్షులు బాలెంల మల్లయ్య,గ్రామ పంచాయితీ కార్మికులు,రాము,సైదమ్మ,పద్మ,డప్పు కిష్టయ్య,బోడ మల్లమ్మ,కందుకూరి పద్మ తదితరులు పాల్గొన్నారు.