రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సీబీఎస్ఈ స్కూల్ విద్యార్థి మనోజ్‌ కు రజత పతకం

Aug 27, 2026 - 20:06
 0  5
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సీబీఎస్ఈ స్కూల్ విద్యార్థి మనోజ్‌ కు రజత పతకం

 జోగులాంబ గద్వాల 27 ఆగస్టు 2026 తెలంగాణ ప్రతినిధి : ఎర్రవల్లి.  మండల కేంద్రంలోని:  ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్‌ కు చెందిన విద్యార్థి టి. మనోజ్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించాడు. టి.మనోజ్ S/o రామకృష్ణ  12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అండర్-14 విభాగంలో ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచాడు.తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 26, 27 తేదీల్లో హనుమకొండలోని జె.ఎన్.స్టేడియంలో నిర్వహించిన ఈ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో మనోజ్ తన ప్రతిభను చాటుకున్నాడు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వీర శ్రీనివాస్ రెడ్డిచైర్మన్ వీర గోవర్ధన్ రెడ్డి  ప్రిన్సిపాల్  శివకుమార్ మనోజ్‌ ను అభినందించారు. అతని అంకితభావం, కృషి, క్రీడాస్ఫూర్తి పాఠశాలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించారు.మనోజ్ విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, అశోక్, రమేష్‌ లను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన శిక్షణ అందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333