మండల స్థాయి సమావేశం.  విద్యుత్ శాఖపై వాడి వేడి

Jul 29, 2026 - 22:16
 0  1

 జోగులాంబ గద్వాల 29 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బుధవారం డి డబ్ల్యు ఓ  జిల్లా అధికారి సునంద. ఇటిక్యాల మండల ప్రత్యేక అధికారి కార్యక్రమానికి హాజరై. ఆమె అధ్యక్షతన  ఇటిక్యాల ఎంపీడీవో  రమాదేవి ఆధ్వర్యంలో మండల స్థాయి  అన్ని శాఖల పనుల పురోగతి జరిపి  వివిధ గ్రామాల అభివృద్ధి పనులు ప్రభుత్వ కార్యక్రమాలపై అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

    ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మాట్లాడుతూ వివిధ గ్రామాలలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరువ అయ్యే విధంగా ప్రజలకు వివరించి పథకాల గురించి  అవగాహన కల్పించాలని సర్పంచులను మరియు పంచాయతీ కార్యదర్శులను ఆమె కోరారు. వివిధ శాఖల అధికారులు వారికి సంబంధించిన వివిధ గ్రామాల అభివృద్ధిపై సమావేశంలో  సర్పంచులకు వివరించడం జరిగింది. ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు మండల అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు సహకరించాలని ఆమె సమావేశంలో సర్పంచులను కోరారు. మునగాల సర్పంచ్ మా గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫారాల దగ్గర ఏవీ స్విచ్ లేక ఏ చిన్న సమస్య వచ్చినా కూడా  ట్రాన్స్ఫారం బందు చేయాలంటే హెవీ స్చుల్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని చాలా కాలనీలలో కరెంటు స్తంభాలు నా సొంతంగా తీసుకువచ్చి కొన్ని స్తంభాలు గ్రామంలో వేయడం జరిగిందని  సమావేశంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చాగపురం గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ మంచినీళ్లు త్రాగడానికి నేనే స్వయంగా వేరే దగ్గర కుపోయి త్రాగే మంచినీరు తెచ్చుకోవడం జరుగుతుందని సమావేశంలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.మా ఊర్లో విద్యుత్ అధికారులు మంచినీళ్లు వదిలే సమయంలో కరెంటు బంద్ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ అధికారులు వినడం లేదని సమావేశంలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయము మంచినీళ్లు వదిలే సమయంలో కరెంటు బంద్ చేయాలని కరెంటు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయిన వాళ్ళు స్పందించడం లేదని సమావేశంలో ఆమె అసంతృ వ్యక్తం చేశారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా  డి డబ్ల్యు ఓ.సునంద.
ఇటిక్యాల ఎమ్మార్వో శ్రీకాంత్ రెడ్డి.
వివిధ మండల స్థాయి అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333