పండుగ పుట విషాదం

గుండాల 18 ఆగస్ట్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బండ కొత్తపల్లి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గుడి చుట్టూ ట్రాక్టర్లు తిప్పుతున్న క్రమంలో ఒక్కసారిగా పక్కనే ఉన్న జనాల మీదికి ట్రాక్టర్ దూసుకెల్లడంతో అక్కడే ఉన్న రామగిరి శ్రీరాములు(52) పైకి ట్రాక్టర్ దూసుకెల్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.. పోతుగంటి లింగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బుర్ర శేఖర్ కు చేతి విరిగింది. దీంతో గ్రామంలో బోనాల పండుగ రోజున విషాదఛాయలు అలుముకున్నాయి...