న్యాయవ్యవస్థపై రాజకీయ పార్టీల ఒత్తిడి పై నిగ్గు తేల్చాలి.
సి జే ఐ గారి నాయకత్వానికి పరీక్షా కాలం అంటూ 600 మంది న్యాయఅవాదుల లేఖపై సమాజం సీరియస్ గా పరిశీలించాలి.
సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడితేనే పేద వర్గాలకు అంతో ఇంతో రక్షణ ఉంటుంది.
ప్రజాస్వామి కవాదులు ఆలోచించి తీరాలి.
--వడ్డేపల్లి మల్లేశం
భారతదేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపైన అనేక విమర్శలు ఉన్నప్పటికీ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థపై ఇప్పటికీ కొన్ని వర్గాలకు విశ్వాసం రాజ్యాంగ పలాలను పొందడానికి భరోసా ఉన్నట్లుగా గుర్తించడాన్ని మనం గమనించాలి. న్యాయవ్యవస్థ ఎంత బలంగా నిలబడితే అంతే స్థాయిలో రాజకీ య పార్టీల కుట్రలను ఛేదించడానికి, రాజకీయ ఒత్తిళ్లను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రభుత్వాల అధికార పార్టీల జోక్యం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థ పలు ఒత్తిళ్లకు గురవుతున్న నేపథ్యంలో స్వతంత్రంగా ప్రజల కోణంలో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ మార్చి చివరి వారంలో 600 మంది న్యాయవాదులు భారత సర్వోన్నత న్యాయస్థానం సిజెఐ డి వై చంద్ర చూడు గారికి లేఖ రాయడాన్ని సమాజము సీరియస్ గా పరిశీలించాలి ఆలోచించాలి. తమ ప్రతిపాదనలను ముందు ఉంచాలి. ఎన్నికల కమిషన్, ఈ డి, సి బి ఐ, ఐ టి వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నట్లు ఇటీవల అనేక సాక్షాలతో ప్రతిపక్షాలు పత్రికారంగ నిపుణులు మేధావులు రాజకీయ విశ్లేషకులు ప్రజల ముందు ఉంచితే ఇక స్వేచ్చ ఎది? దేశo మొత్తానికి దిక్సూచిగా పని చేయవలసిన న్యాయవ్యవస్థ కూడా ఒత్తిళ్లకు గురైతే పేద, బలహీన, అట్టడుగు, దోపిడికి గురవుతున్న వర్గాలకు రక్షణ ఎండమావియే కదా! అందుకే న్యాయవ్యవస్థను బలంగా నిలపడం కోసం , కుట్ర దారుల కుతంత్రాలను ఛేదించడం కోసం జరుగుతున్న పరిణామాలను నిష్పక్షపాతంగా 600 మంది న్యాయవాదులు లేఖ ద్వారా స్పష్టం చేయడాన్నీ సమాజం స్వాగతించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇది పౌరుల యొక్క సామాజిక బాధ్యత కూడా.
న్యాయవాదుల బృందం అభిప్రాయ పడిన విషయాలు :-
"న్యాయ వ్యవస్థ పైన ఒత్తిళ్లను తీసుకురావడం ద్వారా న్యాయస్థానాల యొక్క ప్రతిష్టలు దిగజార్చడమే కాకుండా ఆ వ్యవస్థ పైన ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని నష్టపరిచేందుకు స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం ప్రయత్నాలు చేస్తున్నదని దానిని అడ్డుకోవడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలని అందుకే ఇది భారత సిజెఐ గారి నాయకత్వానికి పరీక్ష కాలమని" ఆ లేఖలో ఆవేదన ఆగ్రహము బాధ్యతాయుతంగా రాసిన విషయాన్ని గమనించినప్పుడు ఈ దేశంలో అధికార యంత్రాంగం ఏ రకంగా వ్యవస్థలను వీలైన మేరకు దుర్విని యోగం చేయడానికి సిద్ధపడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఆ లేఖపై సంతకాలు చేసిన వారిలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు మనం కుమార్ మిశ్రా సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే పింకీ ఆనంద్ వంటి తదితరులు తమ ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసులలో తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని వర్గాల నుండి ఒత్తిడి స్వార్థపర శక్తులు అమలు చేస్తున్నాయని ముఖ్యంగా విపక్ష నేతలకు సంబంధించిన అవినీతి కేసుల పైన విచారణ జరుగుతున్న తరుణంలో అధికార పార్టీ యొక్క జోక్యం పైన ఆ లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు . భారత సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఈ దశలో హు o దా తనంతో కూడిన మౌనంగా కాకుండా రాబోయే దుష్టశక్తుల ఆగడాలు పరిస్థితుల్ని తట్టుకునేందుకు సుప్రీంకోర్టు బలంగా నిలబడాలని కోరడం ద్వారా రాబోయే విష పరిణామాలు ప్రమాదాలను ఎత్తి చూపినట్లుగా భారత సమాజం భావించి అందుకు తగిన విధంగా స్పందించి న్యాయవ్యవస్థను ఎక్కడికక్కడ కాపాడుకోవడానికి చర్చ జరగాలి. "న్యాయస్థానాల పైన ప్రజలకు ఉన్న విశ్వాసం సడలిపోయేలాగా కొన్ని కీలక తీర్పుల పైన తప్పుడు కథనాలు ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా కొన్ని రాజకీయ శక్తులు కుట్ర చేస్తున్నాయని కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థిస్తూనే రాత్రి మీడియా ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేసేలాగా వ్యవహరించడం సిగ్గుచేటని" ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నది రాజకీయ లబ్ధికోసం కోర్టులను ప్రభావితం చేయడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులను సృష్టించి న్యాయ వ్యవస్థను బలహీనపరచడం ద్వారా అధికార యంత్రాంగం పాలకవర్గాలు తమ ఆధిపత్యాన్ని చెలాయించాలని చూడడానికి ఇది సూచికగా ఉన్నదని ఆ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక "కోర్టులో నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగడంతో పాటు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా విష ప్రచారం చేయడం ద్వారా న్యాయవ్యవస్థ స్థాయి దెబ్బతింటున్నదని ఏ కోశానా ఇలాంటి దుశ్చర్యలను అనుమతించకూడదని" వారు ఆ లేఖలో సీజే ఐ ని ఆయన కోరడం అభినందనీయం . "స్వయం ప్రతిపత్తి పేరుతో హుందాతనంగా ఉండే న్యాయవ్యవస్థ ఇలాంటి దుశ్చర్యల మధ్యన మౌనంగా ఉంటే హాని చేయాలనుకునే వారికి మరింత బలం ఇచ్చినట్లే అవుతుందని న్యాయస్థానాల యొక్క పరిరక్షణ స్వావలంబన కోసం నిలబడాల్సిన పోరాటం చేయవలసిన అనివార్య స్థితి ఏర్పడినట్లు" వారు ఆ లేఖలో సుప్రీం కోర్టును కోరడంలోనే న్యాయ వ్యవస్థలో దాగి ఉన్న సంక్షోభం సంక్లిష్టత కుట్రలు విచ్ఛిన్నకారుల ఆగడాలు ఎంతగా ఉన్నాయో అర్థం అవుతున్నది.
లేఖపై ప్రధాన రాజకీయ పార్టీల స్పందన:-
భారత ప్రధానమంత్రి స్పందిస్తూ ఇతరులను బెదిరించడం బుజ్జగించడం వేధించడం కాంగ్రెస్కు పాతకాలం నుండి అలవాటని ఐదు దశాబ్దాల క్రితమే కేంద్రానికి కట్టుబడి ఉండే విధంగా న్యాయవ్యవస్థ ఉండాలని పిలిపిచ్చినటువంటి కాంగ్రెస్ను విమర్శించి ఇకనైనా స్వార్థ ప్రయోజనాలను మానుకొని న్యాయ వ్యవస్థ పరిరక్షణలో నిబద్ధత చాటుకోవాలని కోరడం వెనుక బిజెపి ఎన్డీఏ చిత్తశుద్ధి కాక ప్రతిపక్ష కూటమిపై విమర్శ మనకు కొ ట్ట వచ్చినట్లుగా కనబడుతున్నది.
ఇక ఇటీవల దశాబ్ద కాలంగా గమనించినట్లయితే రాజ్యాంగబద్ధ సంస్థలైన అన్ని వేదికలు దుర్వి నియోగానికి గురికావడం ప్రతిపక్షాలు ప్రశ్నించే వాళ్ళ గొంతులను నొక్కడానికి వాటిని దుర్యోగం చేసినట్లుగా అనేక ఆరోపణలు వస్తున్న వేల ప్రధానమంత్రి వ్యవస్థను ప్రతి రాజ్యాంగబద్ధ సంస్థల కూడా బెదిరిస్తూ బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టే ధోరణిలో వ్యవహ రిస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున విమర్శించారు. ఇదే సందర్భంలో గతంలో సుప్రీంకోర్టుకు చెందినటువంటి నలుగురు సీనీ యర్ న్యాయమూర్తులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం కూని అవుతున్నదని చెప్పడాన్ని బిజెపి ప్రభుత్వం మర్చిపోయిందా? అని వేసిన ఎదురు ప్రశ్న ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పరిస్థితికి అద్దం పడుతున్నది.
న్యాయ వ్యవస్థ గురించి ఇంత బహిరంగంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు, అనుభవాలు, కొన్ని తీర్పుల పైన ప్రతిపక్షాలు అధికారపక్షం ప్రవర్తించిన తీరు కుట్రలు కుతంత్రాలు విమర్శలపైన కచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా దేశ ప్రజలు భారత సిజెఐ గారిని కోరుతున్నారు . సీజె ఐ అంటే ఒక వ్యక్తి కాదని భారత న్యాయవ్యవస్థను నడిపించే ఒక శక్తిగా ప్రజలు ప్రజాస్వామిక వాదులు చూడాలి. అదే సందర్భంలో అధికార పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా న్యాయవ్యవస్థను సగౌరవంగా చూసినప్పుడు మాత్రమే రాజ్యాంగ పలాలను అట్టడుగు స్థాయిలోకి తీసుకు వెళ్లడానికి న్యాయవ్యవస్థకు అవకాశం ఉంటుంది. న్యాయ వ్యవస్థ ముందు ప్రమాదం పొంచి ఉన్నదని 600 మంది న్యాయవాదులు లేక రాసిన తర్వాత కూడా భారత సమాజం స్పందించకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేనట్లే ఉంటుంది అని గుర్తిస్తే మంచిది.ఇతర రాజకీయపార్టీలు,ప్రజాసంఘాలు సీరియస్ గా పరిశీలించాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )