గ్రంధాలయాలకు పుస్తకాల పంపిణీ .
జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.
గద్వాల .
జిల్లాలోని9 మండల కేంద్రాలలో గల శాఖ గ్రంధాలయాలకు, గ్రామీణ గ్రంథాలయాలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు పుస్తకాల పంపిణీ చేశారు. జిల్లాలోని 9 మండల కేంద్రాలతో పాటు గ్రామీణ గ్రంథాలయాలైన ఉండవెల్లి, ఇటిక్యాల పాడు, రాజోలి, నాగర దొడ్డి గ్రామాలకు కూడా జనరల్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకుడు రామాంజనేయులు తదితరులు ఉన్నారు.