నెట్టెంపాడులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

Aug 14, 2025 - 18:58
 0  19

- డ్రైనేజీ లేక ఇళ్లలోకి చేరిన మురుగునీరు.

- మురుగునీరుతో కాలనీలు కంపు కంపు.

- ఎస్సీ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ నిండుకున్న మురుగు.

- ఇండ్లకు అర్త్ వస్తుందని మొర పెట్టుకున్నా కనికరించని వైన్యం.

- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలు.

- పట్టించుకోని పాలకులు అధికారులు.


 జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్:  మండలలోని నెట్టెంపాడు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కాలువల గుండా మురుగునీరు ప్రవహించే మార్గం లేక డ్రైనేజీ కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.ఇళ్లముందు ఉన్న కాలువల్లో మురుగు నీరు ఉన్నప్పటికీ, దుర్వాసన వెదజల్లుతుండటంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో అనేక రకాలుగా వ్యాధుల బారిన పడతానేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ కాలనీలో మురుగునీరు మొత్తం ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చేరి అర్త్ వస్తుందని దీంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

డ్రైనేజీ లేని కారణంగా స్థానికులు ప్రతి రోజూ మురుగు నీటి మధ్య సహజీవనం సాగిస్తున్నా అధికారులు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఎవరైనా ప్రజలు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం శోచనీయం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని,బీసీ,ఎస్సీ ఇతర కాలనీలో డ్రైనేజీలు లేక మురుగు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా కాలువలు నిర్మించక పోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు రోడ్లపై పారి నివాసాల మధ్య నిలుస్తూ దుర్గంధం వెదజల్లుతోందని మండిపడుతున్నారు. దీంతో కాలనీలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. వర్షం పడితే జనం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని,ప్రజల సమస్యల పరిష్కరించడంలో అధికారులు మరియు పాలకులు పూర్తిగా విఫలం చెందడానికి ఈ ఘటన నిదర్శనం అని ఇప్పటికైనా అధికారులు మురుగునీరు నిల్వ ఉండకుండా వెళ్లేందుకు మార్గం దిశగా చర్యలు చేపట్టి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని నెట్టెంపాడు గ్రామ ప్రజలు, కాలనీవాసులు కోరుతున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333