రెండు ఉద్యోగాలకు ఎంపికైన ఓ సాదారణ గృహిణి
పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం, అలాంటిది ఓ గృహిణి, హోటల్ నిర్వహిస్తూ, ఖాళీ సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఆకాంక్షతో చదువు కొనసా గించారు. పోటీ పరీక్షలకు హాజరై ఒకేసారి రెండు ఉద్యో సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు.
కేసముద్రం మండల కేంద్రానికి చెందిన చీకటి జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ వరకు చదు వుకున్నారు. మండలంలోని కల్వల గ్రామానికి చెందిన నవీన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమా రుడు మల్టీమీడియాలో శిక్షణ పొందుతుండగా రెండో కుమారుడు ఇంట ర్మీడియట్ చదువుతున్నారు. ఆ దంపతులు జీవనోపాధికోసం మండల కేంద్రంలో 2018 నుంచి హోటల్ నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వహణలో భర్తకు సహాయంగా నిలుస్తూనే ఆమె ఏంఏ, బీఈడీ పూర్తి చేశారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన గురుకుల పాఠశాలల పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్ లెక్చరర్ల ఉద్యోగ పరీక్ష రాశారు. వారం రోజుల కిందట వెలువడిన పీజీటీ ఫలితాల్లో జ్యోతి ఎంపికయ్యారు. గురువారం వెలువరించిన జూనియర్ అధ్యాపకుల ఉద్యోగాలకు ఉద్యోగాల ఫలితాల్లోనూ అర్హత సాధించారు. రెండు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ఆమె తన సంతోషం వ్యక్తం చేశారు.