రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని జేఏసీ పాదయాత్ర
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని జేఏసీ పాదయాత్ర రోడ్డుపై గుంతలు కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని 12 కిలోమీటర్లు పాదయాత్ర. రోడ్డుపై ఉన్న గ్రామాల నేతల సంఘీభావం... ఆత్మకూరు ఎస్.. సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై గత మూడేళ్లుగా గుంటలు ఏర్పడడంతో ప్రమాదాల వారిని పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అధికారులు గుంతలు పూడ్చాలంటూ ఆత్మకూర్ ఎస్ మండల సామాజిక సేవ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర చేశారు. మండల పరిధిలోని కోటి నాయక్ తండా నుండి ముక్కుడుదేవుల పల్లి శివారు వరకు సుమారు 12 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. గత మూడేళ్లుగా రోడ్లపై ఏర్పడిన గుంతలను పట్టించుకోకపోవడం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారని జైఏసి అధ్యక్షులు భూపతి రాములు అన్నారు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న రహదారి గుంతల పట్ల అధికారులు, పాలకులు నిర్లక్ష్యం తగదన్నారు. ఈ రహదారి పై వారానికి రెండు మూడు ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కోల్పోతున్నారని మరి కొందరు అంగవైకల్యం చెబుతున్నారని వాపోయారు. వెంటనే గుంతలుపూడ్చి రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ అధికారులు పట్టించుకోనట్లైతే ఉద్యమాన్ని శాంతియుతంగా ఉదృతం చేస్తామన్నారు. కోటి నాయక్ తండ వద్ద ప్రారంభమైన జైసి పాదయాత్రకు దుబ్బతండా ఎనుబాముల, నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద, పాతర్ల పహాడ్ స్తేజీల వద్ద ఆయా గ్రామాల ప్రజలు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలుపుతూ స్వాగతం పలికారు. పాదయాత్ర లో జేఏసీ నాయకులు దండా వెంకటరెడ్డి, గంపల కృపాకర్, దొంతగాని కర్ణాకర్,జలగం మల్లేష్, గుండు వెంకన్న, పందిరి మాధవరెడ్డి, మెడీ కృష్ణ,సాయికుమార్, గుండు రమేష్,లక్ష్మణ్, సంఘీ భావం తెలిపిన వారు మాజీ సర్పంచ్ జాటోతు రవీందర్, జాటోత్ పెద్ద శ్రీను,pacs డైరెక్టర్ అశ్లం, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, చందు నాయక్,సైదులు , సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గంట నాగయ్య సైదులు, ఉపేందర్ రెడ్డి, ఇర్మయ్య లు స్వాగతo పలికారు. జేఏసీ నాయకులను పూల మాల శాలువాలతో ఘనంగా సన్మానించారు.