జిల్లాలో వర్షాల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
నకిలీ విత్తనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
నెల వారి నేర సమీక్షా సమావేశంలో- - - - - జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ .
జోగులాంబ గద్వాల 29 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల జిల్లా లో ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా చూడాలని, నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ఎక్కడైనా రోడ్డు పాడైన , నీరు నిండుకున్న వాహన దారులు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా తక్షణమే స్పందించి పోలీస్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గత నెలలో జరిగిన నేరాలపై మరియు గతంలో జరిగిన కేసుల వివరాలు వాటి పురోగతిని తెలుసుకునేందుకు జిల్లా పోలీస్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశo నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వర్షాకాలం ముందస్తుగా ప్రారంభమై నిరంతరంగా కురుస్తున్న దృష్ట్యా సిబ్బందినీ అప్రమత్తo చేస్తూ పోలీస్ స్టేషన్ నందు ఉండెల చూడాలని, ఎక్కడైనా రోడ్డు పాడైన , నీరు నిండుకున్న అక్కడ ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు వెంటనే చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలలో ఇప్పటికే గుర్తించిన హాట్ స్పాట్స్ లలో R &B వారితో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని, వాహనాలలో అత్యవసర సామాగ్రిని కలిగి ఉండాలని, అలాగే వాగులు వంకలు బ్రిడ్జిలను దాటి ప్రవహిస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా రైతులు మోసపోకుండా నకిలీ విత్తనాలను చలామణిలో లేకుండా కఠినమైన చర్యలను తీసుకోవాలని, టాస్క్ ఫోర్స్ బృందాలు నిత్యం షాప్స్, గోదాములలో తనిఖీలు చేపడుతూ ఆక్టివ్ గా ఉండాలని, రైతులు నాణ్యమైన విత్తనాలను గుర్తింపు పొందిన దుకాణ యజమానుల వద్ద పొందేల రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణా జరగకుండా చూడాలని, జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్లను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉండాలని తెలిపారు. డయల్ 100, బ్లూ కోర్ట్ సిబ్బంది గ్రామ గ్రామాన సందర్శిస్తూ విజిబుల్ పోలిసింగ్ ను పెంచాలని, ఎలాంటి సమాచారమైనా డయల్ 100 లేదా విపిఓ కు సంప్రదించాలని తెలిపారు.
పోలీస్ అధికారులకు, సిబ్బంది పనితీరును సులభతరం చేసుకునేందుకు అమలవుతున్న HRMS ను అందరూ ఆన్లైన్ లో ఆచరించేవిధంగా చూడాలని, సిబ్బంది లీవ్ లు, గ్రీవెన్స్, రివార్డులు, పనిష్మెంట్ లు తదితర వివరాలు HRMS ద్వారా పొందెల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నమోదు అయ్యే కేసులకు సంబంధించిన సీడీ ఫైల్స్ ను రైటర్స్ CCTNS ద్వారా ఆన్లైన్ లో పొందుపరచాలని చర్యలు తీసుకోవాలని,ప్రజావాణి వచ్చిన ప్రతి పిర్యాదలపై తీసుకున్న చర్యలను రిపోర్ట్ ద్వారా పంపాలని, రానున్న లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్ ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు గ్యాంబ్లింగ్ గుడుంబా లాంటివి జరగకుండా గస్తీ నిర్వహించాలని సూచించారు.
మెగా వెహికల్ చెకింగ్ లు, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లు నిర్వహించి ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల పై ప్రజలను చైతన్యం చెయ్యాలని, నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
నేర సమీక్ష సమావేశంలో గత నెలలో జరిగిన మోసాలు నేరాలపై అధికారులను అడిగి తెలుసుకుని కేసుల నమోదు, దర్యాప్తు, పరిశోధనపై పలు సూచనలు చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తులను పూర్తి చేసి కోర్టు నందు చార్జి సీటు దాఖలు చేయాలని సూచించారు. ఆయా కేసులలో అరెస్ట్ పెండింగ్ లేకుండా చూడాలనీ, వర్టికల్స్ ల పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నవీకరిస్తూ ఉండాలని సూచించారు. కోర్టు డ్యూటీ అధికారి తో వారాంతంలో సమీక్ష సమావేశం నిర్వహించి కోర్టులో జరిగే ప్రతి అంశాన్ని తెలుసుకొని బాధితులకు న్యాయం చేసే విధంగా నిదితులకు శిక్షలు పడేలా కృషి చెయ్యాలని అన్నారు.
ఈ సమవేశం లో డి .ఎస్పీ మోగిలయ్య , ఆలంపూర్, గద్వాల్, శాంతి నగర్ సీఐ లు రవి బాబు, శ్రీనివాస్ , టాటా బాబు,ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సై లు, ఐటీ , డీసీ అర్బి విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.