నిత్యావసర సరుకులు భద్రగిరి మార్ట్ ద్వారా ఉత్పత్తిదారుల జీవనోపాధి కి చేయూత.
సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు& యస్ హెచ్.జి గ్రూప్ మహిళలు తయారుచే సే నిత్యావసర సరుకులు భద్రగిరి మార్ట్ ద్వారా ఉత్పత్తిదారుల జీవనోపాధి కి చేయూత.
తెలంగాణవార్త ఏప్రిల్ 1జిల్లా స్టాపర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు నడుపుకుంటున్న గిరిజన మహిళలు మరియు ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు వారు తయారు చేసే నిత్యవసర సరుకులు మధ్య దళారుల పాలు కాకుండా భద్రగిరి మార్ట్ లో అందించి వారి జీవనోపాధికి చేయూత అందించడానికి భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సేర్ఫ్ సీనియర్ మేనేజర్ భవాని శంకర్ కు తెలిపారు.
బుధవారం నాడు భద్రాచలం పట్టణంలోని ఆర్గానిక్ మరియు గిరిజన మహిళలు, ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు వారు తయారు చేసి భద్రగిరి మార్టులో ఏర్పాటుచేసిన నిత్యవసర సరుకులను పరిశీలించడానికి వచ్చిన సేర్ఫ్ సీనియర్ మేనేజర్ భవాని శంకర్కు భద్రగిరి మార్ట్ లోని న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ సంబంధించిన ఇతర నిత్యావసర సరుకులను గిరిజన మహిళలు తయారు చేసిన విధానము ఆర్గానిక్ సంబంధించిన ఆహార పదార్థాలు వివరాలు విపులంగా తెలియజేసిన అనంతరం పిఓ మాట్లాడుతూ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకున్న మహిళలకు మార్కెట్ సౌకర్యం సరిగా లేకపోవడంతో వారు తయారు చేసిన ఆహార పదార్థాలు ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకొని జీవనోపాధి పొందడం సమస్యగా ఉందని కొందరు మహిళలు తన దృష్టికి తీసుకురాగా, వారు తయారు చేసిన పలు రకాల న్యూట్రిషన్ కి సంబంధించిన ఆహార పదార్థాలు, ఆర్గానిక్ ద్వారా పండించిన బియ్యం, పప్పు దినుసులు ఇతర తృణధాన్యాలు సమృద్ధిగా లభిస్తున్నట్టు తెలుసుకొని వారికి సరియైన మార్కెట్ సౌకర్యం కల్పించాలనె దృక్పథంతో ఐ టి డి ఏ యూనిట్ అధికారుల సహకారముతో భద్రగిరి మార్టును ప్రారంభించామని, ప్రజల నుండి కూడా మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు.
అనంతరం సేర్ఫ్ సీనియర్ మేనేజర్ భద్రగిరి మార్ట్ లోని నిత్యవసర సరుకులను పూర్తిస్థాయిలో పరిశీలించి వాటి తయారీ విధానము గురించి అడిగి తెలుసుకున్న అనంతరం గిరిజన మహిళలు ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలకు మంచి తోడ్పాటు అందించి వారు తయారు చేసిన నిత్యవసర సరుకులు తినుబండారాలు మంచి ప్రాచుర్యం లోకి రావడానికి తప్పకుండా మా సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, భద్రగిరి మార్ట్ ప్రారంభించి గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఐటీడీఏ పీవో కు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన అన్నారు.
అనంతరం భద్రగిరి మార్ట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచిన ఇతర ఆర్గానిక్ నిత్యవసర సరుకులు ఆహార పదార్థాలు అమ్మకాల గురించి మరియు ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉన్నదని సంబంధిత భద్రగిరి మార్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకుని, నిత్యవసర సరుకులు ప్రజలు కొనుగోలు చేసిన వెంటనే వాటికి సంబంధించిన బిల్లులు అందజేయాలని ర్యాకులలో మాత్రం నిత్యవసర సరుకులు అయిపోయిన కొద్దీ వెంటనే భర్తీ చేయాలని అవసరమైతే అడ్వాన్సుగా సంబంధిత గ్రూపులకు ఆర్డర్ ఇచ్చి సకాలంలో అందించేలా చూడాలని అన్నారు. ప్రజలు అడిగిన ప్రతి వస్తువు దొరికేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏపీవో పవర్ వేణు, జేడీఎం హరికృష్ణ, డి ఎం జి సి సి సమ్మయ్య, మేనేజర్ ఆదినారాయణ, జిసిసి మేనేజర్ జయరాజ్, భద్రగిరి మార్ట్ మేనేజర్ భార్గవి, డిపిఎం నర్సయ్య, ఏపీఎం వెంకన్న మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.