నాగోల్ లో జీఎస్కే స్పోర్ట్స్ అరినా గ్రాండ్ ను నూతనంగా ప్రారంభించారు
ఎల్బీనగర్, 24 నవంబర్ 2025 సోమవారం తెలంగాణ వార్త రిపోర్టర్;నాగోల్ లో జి.ఎస్.కె స్పోర్ట్స్ అరినా గ్రాండ్ ను ఘనంగా ప్రారంభించారు.ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి మధుయాష్కీ గౌడ్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త హాజరయ్యారు.ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ..క్రీడా ప్రతిభను పెంపొందించడానికి, ధైర్యాన్ని పెంచడానికి మరియు ప్రతి బాలుడిని శక్తివంతం చేయడానికి రూపొందించిన అత్యాధునిక మల్టీ-స్పోర్ట్స్ ఫెసిలిటీ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులకు అండగా వుంటుంది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్,కొత్త పేట కార్పొరేటర్ పవన్ కుమార్ బొగ్గారపు శరత్ స్కూల్ యాజమాన్యం,డాక్టర్ ఎంఏ గిరిధర్, కార్తిక్ ఐవిఎఫ్ నాయకులు నరేష్ గుప్త,వీరేందర్ రామకృష్ణ , సాయి, శ్రీధర్, శ్రవణ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.