జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించిన సీనియర్ జర్నలిస్టు "డాక్టర్" బంటు కృష్ణ

ను సన్మానించిన టిఎస్ జే ఏ జర్నలిస్టులు

Feb 29, 2024 - 20:39
 0  4
జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించిన సీనియర్ జర్నలిస్టు "డాక్టర్" బంటు కృష్ణ
జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించిన సీనియర్ జర్నలిస్టు "డాక్టర్" బంటు కృష్ణ

 పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు 

టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరు యాదగిరి

ప్రజలకు జర్నలిజం వృత్తి ఆదర్శంగా ఉండాలి గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీత "డాక్టర్" బంటు కృష్ణ

సూర్యాపేట:- పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పిహెచ్ డి చేసి డాక్టరేట్ పట్టా పొందడంతో  పాటు బంగారు పతకాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అందుకున్న సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత "డాక్టర్" బంటు కృష్ణను తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, రాష్ట్ర కమిటీ,ఉమ్మడి జిల్లా కమిటీ, సభ్యులు గురువారం సాయంత్రం బంటు కృష్ణ గృహానికి వెళ్లి ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కందుకూరి యాదగిరి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో గత 30 సంవత్సరాలుగా స్థానిక వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ కథనాలతో వివిధ పత్రికల్లో వార్త కథనాలు రాస్తూ  ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి జర్నలిజం పై తన చేసిన ప్రత్యేక పరిశోధన, అధ్యయనం ద్వారా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ సాధించడం పట్ల జర్నలిస్టు సమాజం అంతా హర్షిస్తుందని తెలిపారు.

 జర్నలిజం అంటేనే కత్తి మీద సాము లాంటి వృత్తి అని, ఇలాంటి వృత్తిలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ తనతోటి జర్నలిస్టులకు, కొత్తగా జర్నలిజం రంగంలోకి వచ్చిన వారికి, వస్తున్న వారికి అనేక సలహాలు, సూచనలు చేస్తూ అందిస్తూ మార్గదర్శకుడుగా ఉంటూ, జర్నలిస్టు వృత్తికి వన్నె తీసుకొస్తూ జర్నలిజంలో అగ్ర శిఖరాలకు చేరుకొని అరుదైన ఘనతను బంగారు పతకం సాధించి సూర్యాపేట పేరును దిగంతాలకు చాటి మంచి పేరు తీసుకొచ్చిన బంటు కృష్ణ ఎంతోమంది పాత్రికేయులకు  ఆదర్శంగా నిలబడ్డారని ప్రశంసించారు. జర్నలిస్టుల అసోసియేషన్లకు, యూనియన్లకు అతీతంగా గోల్డ్ మెడల్ సాధించిన బంటు కృష్ణ ను సన్మానించడం తమ వృత్తిని గౌరవిస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా ఉండి ఒకరినొకరు గౌరవించుకోవాలని, ఎక్కడా చులకన కావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బంటు కృష్ణ మాట్లాడుతూ జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించిన తనను తోటి సహచర జర్నలిస్టులు గుర్తించి సన్మానించడం పట్ల హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలుపుతూ సమాజానికి జర్నలిస్టులు ఆదర్శంగా ఉండాలని అన్నారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దుర్గం బాలు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి సైదయ్య, సూర్యాపేట పట్టణ కార్యదర్శి తప్సి అనిల్,అసోసియేషన్ సభ్యులు వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333