నకిరేకల్ గురుకుల పాఠశాలలో ఒకేషనల్ కోర్సులో వచ్చిన సీటును క్యాన్సల్ చేసిన ప్రిన్సిపాల్ యం మంజుల
నకిరేకల్ 24 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒకేషనల్ కోర్సులో(ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్) సీట్ అలాట్మెంట్ అని ఫోన్ చేసిన అధ్యాపకురాలు గత 20 రోజుల ముందే సీటు కన్ఫర్మ్ అయిందని నకిరేకల్ గురుకుల పాఠశాలలో జాయిన్ కావాలని అన్నారు.మరల పదేపదే ఫోన్ చేసి అంబికా అనే అమ్మాయిని పంపించాలని ఫోన్ చేయగా అమ్మాయి అంబికను 24/6/2024న పాఠశాలకు తీసుకురాగా ఇచ్చి ఏదో షాకు చెప్పి ఇంటికి పంపించడం అదే విషయం ప్రిన్సిపాల్ మంజూలను వివరణ కోరగా ఆధార్ కార్డు పై డేట్ అఫ్ బర్త్ తప్పుగా ఉందని చెప్పడం జరిగిందన్నారు.ఎస్ ఎస్ సి మెమో,టి సి పైన 2007 ఉందని తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నా ప్రిన్సిపాల్ యం మంజుల వినకుండా సర్టిఫికెట్ ఇచ్చి సీట్ లేదని వేరే కాలేజీలో పొమ్మని పంపించారు. ఇదే విషయం ముందుగా చెప్పాలి కదా మేడం అని తల్లిదండ్రులు అడగగా మేము చూసుకోలేదు మేము మర్చిపోయాము. అని సమాధానం ఇచ్చారు.ఇప్పుడు ఆల్రెడీ సీట్లు పూర్తయినవి కదా మేడం అంటే ఏదో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇంకేం కావాలని అన్నారు.