స్వపరిపాలన దినోత్సవం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి
*స్వపరిపాలన దినోత్సవం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి*
తుంగతుర్తి ఫిబ్రవరి 25 తెలంగాణ వార్తా ప్రతినిధి
తుంగతుర్తి మండల పరిధి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటిలో.. విద్యార్థులు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులుగా అధికారులుగా, విద్యాశాఖ అధికారులుగా, ప్రజా ప్రతినిధులుగా, తమదైన పాత్ర పోషించి..అలరించారు... చక్కటి బోధనోపకరణాలతో తరగతి గదులలో బోధించారు, అధికారులుగా పాఠశాల స్థాయి పర్యవేక్షణలో.. వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ అడిగి తెలుసుకున్నారు.. ప్రతిరోజు తరగతి గదిలో విద్యార్థులుగా కూర్చుని అభ్యసించే తమ తోటి స్నేహితులు/విద్యార్థులు..వారి తరగతి గదులలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించేసరికి ఒక కొత్త అనుభూతిని పొందారు.. స్వరిపాలన దినోత్సవం సందర్భంగా..తమదైన స్థాయిలో అత్యున్నతమైన ప్రతిభ కనపరచి, రాణించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసి, సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది...ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ గారు మాట్లాడుతూప్రతి ఒక్కరు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని,క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకొని,భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని..ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా చదువులు ఉన్నాయని చదువుతోపాటు ఆటాపాటలు, అన్ని రంగాల్లో శిక్షణ ఇస్తామన్నారు...స్వపరిపాలన దినోత్సవంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొట్ల రిషికేష్ గౌడ్, విద్యాశాఖ మంత్రిగా తునికి జోషిత, ఎమ్మెల్యేగా గుగులోతు చంద్రశేఖర్,గవర్నర్గా గౌడిచర్ల ఆరాధ్య, జిల్లా కలెక్టర్గా రామనబోయిన ప్రవస్థి, జిల్లా విద్యాశాఖ అధికారిగా వీరబోయిన భవ్యశ్రీ, ఎంఈఓ గా బండ అవంతిక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా గాజుల నందిత, మండల పరిషత్ అధ్యక్షురాలుగా సంటి దీక్షిత, మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కసరబోయిన మనిశ్రీ, మండల ఎమ్మార్వో గా దాసరి రోహన్, గ్రామ సర్పంచ్ గా చిర్ర జయదేవ్... పాత్రలు పోషించారు
ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం.. పాలకుర్తి ఎల్లయ్య, మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మనబోయిన నవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్ట గడుపుల విక్రం, గుండ్ల ఆంజనేయులు, మాలోతు కృష్ణ, అబ్బ గాని మంజుల, శీలోజ్ రమాదేవిలు పాల్గొన్నారు