నందిగామలో భారీగా నిషేధిత కాలం చెల్లిన మందులు""డ్రగ్ కంట్రోల్ అధికారులు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి : నందిగామలో భారీగా నిషేధిత కాలం చెల్లిన మందులను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెయిన్ బజార్ లోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న కార్తికేయ మెడికల్ సెండ్ సర్జికల్ స్టోర్ లోని ప్రతి మెడికల్ ను సోమవారం మధ్యాహ్నం నుండి మెడికల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పలువురు ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. షాప్ లోని ప్రతి మెడిసిన్ ను పరిశీలించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కొన్ని మందులను అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి సీక్ చేశారు. ఇదే సమయంలో షాపులో ఉండవలసిన కొన్ని మెడికల్ కు సంబంధించిన మెడిసిన్ షాపు యజమాని ఇంట్లో ఉండటంతో ఇంటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్ లో ఉండవలసిన సిరప్పులు కొన్ని షాపు యజమాని ఇంట్లో ఉండటం పట్ల అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులపై అసిస్టెంట్ డైరెక్టర్ ని వివరణ కోరగా ఇంకా సోదరులు చేయవలసి ఉందని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అయితే కార్తికేయ మెడికల్ సర్జికల్ స్టోర్ పై దాడి నిర్వహించి స్వాధీనం చేసుకున్న నిషేధిత కాలం తీరీన మందులు వివరాలను డగ్స్ కంట్రోల్ అధికారులు మీడియాకు చెప్పటానికి అంగీకరించకపోవడం గనుక ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం అవుతుంది. డక్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇతర సిబ్బంది కార్తికేయ మెడికల్ అండ్ సర్జికల్ స్టోర్స్ ను మూసి వేయించి ఆ షాపు యజమాని గృహంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం బగ్స్ కంట్రోల్ అధికారులు మెయిన్ బజార్ లోని ఒక షాపు తనిఖీ నిమిత్తం రాగా మెడికల్ అసోసియేషన్ సభ్యులు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లంచాలు తీసుకుంటూ దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపద్యంలో తిరిగి రెండు రోజుల తరువాత అదే మెయిన్ బజార్ లోని కార్తికేయ మెడికల్ అండ్ సర్జికల్ స్టోర్ పై అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున మందులు స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయేమోనని ముందుగానే నందిగామ పోలీస్ స్టేషన్ నుండి డగ్స్ కంట్రోల్ అధికారులకు రక్షణగా ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల క్రితం నందిగా మెడికల్ షాపులపై దక్ష అధికారులు దాడి చేసినప్పుడు హడావుడి చేసిన మెడికల్ అసోసియేషన్ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గాని కార్తికేయ మెడికల్ సెండ్ సర్జికల్ స్టోర్ పై దాడి చేస్తున్న కనిపించకపోవడం గమనార్హం.