మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాట""మంత్రిగారి కారులో ఎమ్మెల్యేను కొట్టిన ఎంపి

తెలంగాణ వార్త ప్రతినిధి : మంత్రి గారి కారులో ఎమ్మెల్యేను కొట్టిన ఎంపీ
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల కుమ్ములాట
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని కొట్టిన ఎంపీ మల్లు రవి, తిరిగి ఎంపీ మీద దాడి చేసిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకు రాకుండా, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
ఇప్పటికే పలుసార్లు ప్రోటోకాల్ రగడ కాగా సర్దిచెప్పాలని చూసిన మంత్రి జూపల్లి
ఇటీవల భూభారతి రైతు అవగాహన సదస్సులో గొడవ కాగా మంత్రి పొంగులేటి కారులో గన్ మెన్లను దించేసి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలతో వెళ్ళగా ఓడిపోయిన సరితా తిరుపతయ్య ను ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ వాదనకి దిగిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
కోపంతో ఊగిపోయి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెంప మీద కొట్టిన మల్లు రవి.. తానేం తక్కువ తినలేదు అంటూ ఎంపీ మీద దాడి చేసిన ఎమ్మెల్యే బండ్ల
ఊహంచని పరిణామంతో షాక్ అయిన మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చోగా మౌనంగా ఉండిపోయాడు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు