విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకోని ప్రైవేటు విద్యాసంస్థలు**ఏపీ నందిగామ

Apr 30, 2025 - 19:22
Apr 30, 2025 - 19:51
 0  4
విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకోని ప్రైవేటు విద్యాసంస్థలు**ఏపీ నందిగామ

విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకోని ప్రైవేటు విద్యాసంస్థలు..

ఎవరిపై చర్యలు తీసుకోవాలి ఎవరినీ అడగాలి....?

క్లాసులు పెట్టి నడుపుతున్న విద్యాసంస్థల మీద...

చదువే మాకు ముఖ్యం అనుకున్న తల్లిదండ్రుల మీద...

ఎక్కడ కనిపించని విద్యార్థి సంఘాలు..అని ప్రశ్ననిస్తున్న విద్యార్థి నీ విద్యార్థుల తల్లి దండ్రులు..?

ఎన్టీఆర్ జిల్లా నందిగామ*ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ...

ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేసవి సెలవులను ప్రకటించాయి.

ఏప్రిల్ 23వ తేదీ (బుధవారం)తో ఈ విద్య సవంత్సరం ముగిసింది. చివరి రోజు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులు అందజేశారు. దీంతో గురువారం (ఏప్రిల్ 24) అన్ని విద్యాసంస్థలకు సెలవులు అమలులోకి వచ్చాయి. వేసవి సెలవులు జూన్‌ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి.ఇక పాఠశాలలు మాత్రం కొత్త విద్యా సంవత్సరం (2025-26) జూన్‌ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్‌ 6న విధుల్లో చేరాలని ఏపీ విద్యా శాఖ ఆదేశించింది.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో

నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్,కళాశాలలు మరియు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు, కోరుతున్నారు. ఎక్కడ కనిపించని విద్యార్థి సంఘాలు అని ప్రశ్నినిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు తల్లి దండ్రులు?.. సంవత్సరమంతా విరామం లేకుండా చదివే పిల్లలకు వేసవి సెలవులలో కొంత విశ్రాంతి లభిస్తుందని, దానికి కూడా వారికి దూరం చేస్తూ క్లాసులు నిర్వహించటం

ఎమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న ప్రవేట్ పాఠశాలలు మరియు ప్రవేట్ కళాశాలలు పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State