ధాన్యం కొనుగోలు అమ్మకాలపైన శ్వేత పత్రం విడుదల చేయాలి
సూర్యాపేట జిల్లా కేంద్రం.... రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖులు భారత ఆహార సంస్థను వ్యాపార సంస్థగా మలచి తద్వారా డబ్బులు సంపాదిస్తున్నారని దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దందా నడుస్తున్నదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలోని వజ్రా రైస్ ఇండస్ట్రీలో ఇవ్వవలసిన దాన్ని తక్కువగా ఉందని ఆరోపిస్తూ వట్టే జానయ్య యాదవ్ పైన నీలాప నిందలు వేస్తున్నారని ఈ అంశాలపై వివరణ ఇచ్చినందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత ఆహార సంస్థ లాభాపేక్ష లేకుండా నడపవలసిన సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేసి తమ దగ్గర దాచుకోవడానికి స్థలం లేక అడ్డగోలుగా మిల్లుల వద్ద డంపు చేసి తిరిగి బియ్యం తీసుకునే సమయంలో పద్ధతి ప్రకారం ఇవ్వాలని ప్రభుత్వం మాట్లాడటం అన్యాయమని అన్నారు. ధాన్యం మూడు సంవత్సరాల తర్వాత ఎంత తరుగు పోతుందో ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం గమనించదని, మిల్లర్లను బెదిరించి కోట్ల రూపాయలు గడిస్తున్నారని ఆయన ఆరోపించారు. గోదాంలలో స్ధలం లేకపోవడం వలన మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తున్నారని అన్నారు. వట్టె జానయ్య యాదవ్ పై జరిగే దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఖండిస్తుందని ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులకు విన్నవించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, ఆవుల అంజయ్య,బొల్లె సైదులు, కోల కరుణాకర్, నెలచర్ల మధు ప్రజాపతి, సత్తు నాగయ్యతదితరులు పాల్గొన్నారు.