ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 502 అడ్మిషన్లు..
అధ్యాపక బృందం సమిష్టి కృషికి ప్రిన్సిపాల్ అభినందనలు..
సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ప్రవేశాల్లో 502 అడ్మిషన్లు నమోదు కావడం హర్షణీయమని కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే 500కు పైగా అడ్మిషన్లు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులను కళాశాలలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయని, జూలై 31వ తేదీలోపు మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.