దుద్దెడ చెరువు లో జాతీయ పక్షి నెమళ్లు ఏడు మృతి
కొండపాక, 12 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కొండపాక మండలం దుద్దెడ నల్లచెరువు ప్రాంతంలోజాతీయ పక్షి నెమళ్లుఏడు మృతి చెందాయి. శుక్రవారం ఓ రైతు పశువుల కు నీరు తాగించడానికి వెళ్లిన రైతుకు నెమలిలు కింద పడిపోయి ఉన్నది చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఫారెస్ట్ బీట్ అధికారి చందు సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే ఆరు మృతిచెందగా ఒకటి తీవ్ర అస్వస్థతతో ఉంది. దానిని వెంటనే దుద్దెడ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన కొద్దిసేపటికి మృతి చెందింది. విష గుళికలు తినడం వల్లనే చనిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు పంచనామ నిర్వహించి చనిపోయిన నెమళ్లను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఖననం చేశాము అని ఫారెస్ట్ బీట్ అధికారీ చెప్పాడు .