దాతలు గ్రంథాలయ అభివృద్ధిలో భాగం కావాలి...కార్యదర్శి బి. బాలమ్మ
మునగాల 22 అక్టోబర్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి:-గ్రంథాలయాల ఆధునీకరణ అభివృద్ధిలో భాగంగా గ్రంథాలయ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రీడింగ్ రూమ్స్ స్థాపనలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని మునగాల మండల పరిధిలోని మాధవరం, విజయ రాఘవాపురం ,రేపాల, గ్రామాలలో ఇప్పటికే దాతల చేత నిర్మించినటువంటి భవనాలలో రీడింగ్ రూమ్స్ కు సరిపడా వసతుల కల్పన పరిస్థితులను సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ పరామర్శించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయాలను గ్రామ గ్రామాలకు తీసుకపోవాలనే అంశంలో ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, పాఠకులకు అందుబాటులో ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండి దాతల ద్వారా నిర్మించిన భవనాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు కి సిద్ధం చేసి ప్రతిపాదన పంపిస్తామని వారు అన్నారు. అలాగే గ్రంధాలయ అభివృద్ధికి దాతల సహకారం, తోడ్పాటుతో గ్రంథాలయ అభివృద్ధి పథంలో ముందుకు తీసుక పోతామని అన్నారు. అనంతరం శాఖ గ్రంధాలయం మునగాల లోని రికార్డులు పరిసర ప్రాంతాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి దేవబత్తిని లలితాదేవి , ఆయా గ్రామాలలోని పెద్దలు ,రీడర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.