దళిత బంధు బాధితులు ఎమ్మెల్యే సామేల్ కు వినతిపత్రం అందజేత

Jul 19, 2025 - 18:53
 0  40
దళిత బంధు బాధితులు ఎమ్మెల్యే సామేల్ కు వినతిపత్రం అందజేత

అడ్డగూడూరు 19 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– అడ్డగుడూరు మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో అడ్డగుడూరు,మోత్కూర్ మండలాల లబ్ధిదారులు అందరూ కలసి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుని కలిసి దళిత బంధు నిధులను విడుదల చేయాలని వినతిపత్రం శనివారం రోజు అందజేశారు.ఎమ్మెల్యే సామేలు సానుకూలంగా స్పందించి మిమ్మల్ని అదుకుంటా వెంటనే మీ నిదులను విడుదల  చేసే విధంగా సంబంధించిన అధికారులతో మాట్లాడుతా అని హామీ ఇవ్వడం జరిగింది.దళిత బందు లబ్ధిదారులు అందరూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు బాలెంల విద్యాసాగర్,బాలెంల నరేందర్,బాలెంల సురేష్,పిల్లి గంగయ్య,బోనాల మహేందర్,ఈటికాల ఆంజనేయులు,పోలేపాక అబ్బులు,బాలెంల మధు, చిప్పలపెల్లి,అంజయ్య,చుక్క సోమన్న,అలువాల శంకర్,ఉప్పల సైదులు,జిల్లా శివాజీ,చెరుకు నిరంజన్,సురారం రాజు,పనికేర సూర్యకుమార్,ఎలిజాల అశోక్,కూరేళ్ల విష్ణు,గూడెపు సైదులు,గూడెపు పరమేశ్,బోనాల అశోక్,మాగి రాములు,చుక్క పాపయ్య,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333