దండు మైసమ్మ నూతన కమిటీ ఎన్నిక పై విచారణ జరిపించాలి

Aug 12, 2025 - 21:06
Aug 13, 2025 - 15:03
 0  16
దండు మైసమ్మ నూతన కమిటీ ఎన్నిక పై విచారణ జరిపించాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ దండు మైసమ్మ నూతన కమిటీ ఎన్నిక పై విచారణ జరిపించాలి. ఆత్మకూర్ ఎస్.. ఇటీవల కాలంలో నిమ్మికల్ లో ఏర్పడినటువంటి శ్రీ దండు మైసమ్మ దేవాలయ కమిటీలో నియమ నిబంధనలకు విరుద్ధంగా, కమిటీ ఎన్నిక జరిగిందనీ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు వీరబోయిన వెంకన్న డిమాండ్ చేశారు.మంగళ వారం నెమ్మికల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీ సభ్యుల అర్హత దరఖాస్తులు వాస్తవ పత్రాలు పరిశీలించాలని ఎంపికలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.చైర్మన్ పదవి నెమ్మికల్ కు ఇచ్చే అనవాయితీ నీ పక్కన పెట్టి పక్క గ్రామానికి ఇవ్వదాన్నీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.ఓకే కుటుంబం లొ ముగ్గురు వ్యక్తుల ముడు పదవులు ఇవ్వడం ఏకపక్ష నిర్ణయమన్నారు. సభ్యులు నైతిక బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా కమిటీ నుండి వైదొలగాలని డిమండ్ చేస్తున్నట్లు తెలిపారు.దీని పై పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఈ విషయం పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఉపాద్యక్షులు వై మధు, జి కర్ణాకర్ మల్లేష్ , కృపాకర్, రాకేష్ ,నారాయణ , ఉపేందర్,శేఖర్ సీతారాములు. తదితరులు పాల్గొన్నారు.