గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు

మంజూరు వెంటనే మంజూరు చేయక పోతే సమ్మెకు వెళ్తాం..

Jun 26, 2024 - 21:37
 0  5
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు

నెమ్మాది వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి

కలక్టరేట్ సూర్యాపేట :- దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే మంజూరు చేయక పోతే సమ్మెకు దిగుతామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి & గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కేటగిరి వైజ్ గా వేతనాలు అమలు చేయాలని, రాజాకీయ వేధింపులు ఆపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలక్టరేట్ ముందు జరుగుతోన్న గ్రామ పంచాయతీ కార్మికుల దర్ణాలో బాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడ వందలాది మంది కార్మికులతో కలక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసీ అనంతరం కలెక్టర్ కు విన్నతీ పత్రం అందజేశారు...

ఈ సంధర్భంగా నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు అరకొర వేతనాలు కూడా నెలనెలా ఇవ్వకుండా ప్రభుత్వము పది నెలలు కూడ ఇవ్వకుండా ఆపితే గ్రామ పంచాయతీ కార్మికులు ఎలా బ్రతకాలో ప్రభుత్వమే చెప్పాలని నెమ్మాది డిమాండు చేశారు...

గత తెలంగాణ ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మీకులతో మల్టీ పర్పస్ విధానాన్ని అమలు చేస్తూ 9500 రూపాయల తో సమయ పాలన లేకుండా రోజుకు 12గంటల పైగా పని చేయించుకున్న సంధర్భంగా జరిగినా 34, రోజుల సమ్మె సంధర్భంగా అప్పటి ప్రతి పక్ష పార్టీ తరపున కాంగ్రస్ నాయకులు ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెసు అధికారము లోకి వస్తె మల్టిపర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనాలు 26వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పిన విషయాన్ని ఎందుకూ మర్చిపోయారో అర్థం కావటం లేదన్నారు.. ప్రభుత్వము ఏర్పడి 6 నెలలు అవుతోంది కాబట్టి నెలల తరబడి వేతనాలు రాకున్నా భరించామని ఇక తట్టుకొనే శక్తి కార్మికుల దగ్గర లేదన్నారు...

గ్రామ పంచాయతీ సర్పంచ్ లు పదవీ కాలం దగ్గర పడుతుందని గ్రామ పంచాయతీ వర్కర్స్ కి ఇవ్వవలసిన జీతాలు కూడ డ్రా చేసుకొని కార్మికుల పొట్టలు కొట్టారని నెమ్మాది వాపోయారు...
మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీసం వేతనం 26వేలు ఇవ్వాలని, నేరుగా కార్మికుల అకౌంట్ లోకి వేతనాలు వెయ్యాలని, అర్హత కలిగిన కార్మికులకు పర్మినెంట్ చేయాలనీ, కేటగిరి వైజ్ గా వేతనాలు అమలు చేయాలని, ఆదివారం సెలవులు, పండుగ రోజూ సెలవులు, రెండు జతల బట్టలు, చెప్పులు, కొబ్బరి నూనె ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ కు వినతి పత్రం అందజేశారు..
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అద్యక్షుడు ధని యాకుల శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు చిట్యాల రవి చంద్ర, వెంకటేష్, సీఐటీయూ జిల్లా నాయకులు బచ్చల కూర స్వరాజ్యం, సయ్యద్ రన్ మియా,వెంకన్న, దయానంద్, బిక్షం, రాంబాబు, సైదులు, నారాయణ, గుర్వమ్మ, వెంకటమ్మ,తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333