స్వరాష్ట్రంలో కూడా పోరాటాలు తప్పడం లేదు.

Jul 15, 2024 - 19:00
Jul 15, 2024 - 19:01
 0  40
స్వరాష్ట్రంలో కూడా పోరాటాలు తప్పడం లేదు.

రాజకీయ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామికం.

డీఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలి.

బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు.

జోగులాంబ గద్వాల 16 జూలై 2024 తెలంగాణవార్త  ప్రతినిధి:-:(ఇటిక్యాల.)::- నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు నేడు ఉద్యోగాల కొరకు కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. కాంగ్రెస్- రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కర్కశకంగా వ్యవహరిస్తుందన్నారు.

 నేటికీ విద్యార్థి నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నిరుద్యోగులు రోడ్లపై ధర్నాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ శూనకానందం పొందుతుందన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా పోరాటాలు చేస్తున్న నాయకులను ఆదివారం రాత్రి సమయంలో పోలీసులచే అరెస్టులు  చేయించడం ఆప్రజాస్వామీకమన్నారు.

ఇటిక్యాల పోలీసులచే బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబును, కోదండపురం పోలీసులచే జిల్లా ఉపాధ్యక్షుడు జీ.మణి కుమార్ లను ప్రభుత్వము అరెస్టు చేయించిందన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాయంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. నిరుద్యోగుల డిమాండ్ మేరకు డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలన్నారు. ఎస్.జీ.టీ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సిలబస్ ఎక్కువగా ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అదేవిధంగా టెట్ పరీక్షల్లో కొత్తగా  అర్హత పొందిన విద్యార్థులకు కూడా ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలన్నారు.డీఎస్సీనీ ప్రభుత్వం ఆగమేగాల మీద నిర్వహించడం ఎంతవరకు సమంజసం మన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థి నాయకులతో కలిసి మాట్లాడాలన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువగా నిరంకుశత్వాన్ని కాంగ్రెస్ పాలన చూపిస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల హామీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State