44వ. వార్డ్. ప్రజలకు విజ్ఞప్తి
44 వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి
మన వార్డ్ లో ఉన్న కొన్ని సమస్యలను మీ దృష్టికి తీసుకవస్తున్నాను..
మునిసిపల్ పారిశుద్ద్య సిబ్బంది అసలు మన వార్డ్ కు రావడం లేదు మరియు మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదు నెలలో ఒక్కసారి కూడా రోడ్స్ ఊడవడం లేదు. ప్రతి రోజు రావలసిన చెత్త కలెక్ట్ చేసే ట్రాక్టర్లు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నాయి. మన వార్డ్ లోని కొంతమంది సీనియర్ సిటిజన్స్ మరియు శ్రేయోభిలాషులు నా దృష్టికి తీసుకువచ్చిన కొన్ని సమస్యలను మన గ్రూప్ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇదే విషయాన్ని మన కార్పొరేటర్ గారికి, శానిటరీ సూపర్ వైజర్ సాంబయ్య గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగినది. వారు వెంటనే స్పందించి రేపు ఉదయం 7:30 ని:లకు మన వార్డును సందర్శించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. కావున సంబంధిత సభ్యులు రేపు ఉదయం అందుబాటులో ఉండగలరు.
వార్డ్ లోని ప్రధాన సమస్యలు:
1. జవాన్ పర్యవేక్షణ లేదు
2. వీధి కుక్కల నియంత్రణ లేదు
3. చెత్త కలెక్షన్ లేదు
4. పరిసరాల పరిశుభ్రత లేదు
5. ఫాగింగ్ లేదు
6. మురుగుకాల్వల పూడిక తీత లేదు
7. మురుగుకాల్వలపై మందు పిచికారీ లేదు
8. మున్సిపల్ వర్కర్స్ డ్యూటీ రోస్టర్ ప్రజలకు అందుబాటులో లేదు
9. వార్డ్ కు కేటాయించిన వర్కర్స్ జాబితా మరియు అటెండెన్స్ రిజిస్టర్ ను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు తాళ్లూరి వేణు గారు (రిటైర్డ్ టీచర్) గారి వద్ద అందుబాటులో ఉంచాలి.
10. శానిటరీ ఇన్స్పెక్టర్ గారి వార్డ్ సందర్శన మరియు పర్యవేక్షణ లేదు.
అదేవిధంగా మీకు తెలిసిన సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అన్నింటినీ సేకరించి క్రోడీకరించి వినతి పత్రం రూపంలో సంబందిత కార్పొరేటర్ గారికి అధికారులకు అందజేసి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకుందామని మనవి చేసుకుంటున్నాను.
మీ
రాధాకృష్ణ పెద్దినేని
హెల్త్ ఇన్స్పెక్టర్
H.No: 11-8-192/1.