తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు

Aug 1, 2026 - 21:52
 0  1
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు!
తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. శనివారం నుంచి రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం లోటు వర్షపాతం నమోదవగా, తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 5 శాతానికి తగ్గినట్టు తెలిపింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333