విశాఖలో ప్రధాని పర్యటనకు భారీ భద్రత
విశాఖలో ప్రధాని పర్యటనకు భారీ భద్రత
ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్ట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 5 గంటల నుంచి 10:45 గంటలకు భోగాపురం చేరుకోనున్న ప్రధాని పర్యటన నిమిత్తం విశాఖ పరిసర ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని రాక సందర్భంగా విశాఖలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించడంతో పాటు, పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు మరియు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేశారు.