తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీర వనిత చాకలి ఐలమ్మ

Sep 10, 2024 - 19:59
 0  6
తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీర వనిత చాకలి ఐలమ్మ

జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీర వనిత చాకలి ఐలమ్మ త్యాగం, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె చూపిన ధైర్యం నేటి తరానికి మార్గదర్శకమని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస రావు అన్నారు.మంగళవారం ఐ.డి.ఓ.సి అవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

  ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో విశేషమైన పాత్ర పోషించారని, ఆమె చూపిన ధైర్యం, తెగువ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిస్వార్థంగా, నిస్సహాయుల పక్షాన నిలబడి జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకామని అన్నారు. చాకలి ఐలమ్మ చూపించిన స్ఫూర్తి ద్వారా సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి, నేటి తరానికి ఆమె త్యాగం మరియు పట్టుదల ఆదర్శంగా ప్రతి ఒక్కరూ  తీసుకొని తమ జీవితాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఏ.ఓ. వీర భద్రప్ప, ఇంచార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333